Cyclone Gulab: నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

గులాబ్ తుఫాన్ గడగడలాడిస్తోంది. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. గులాబ్ ఉత్తరాదిన శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు అన్ని జిల్లాలను ప్రభావితం చేయగా భారీ వర్షాల..

Cyclone Gulab: గులాబ్ తుఫాన్ గడగడలాడిస్తోంది. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. గులాబ్ ఉత్తరాదిన శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు అన్ని జిల్లాలను ప్రభావితం చేయగా భారీ వర్షాల దెబ్బకి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆది, సోమ వారాలలో కురిసిన భారీ వర్షాల నుండి ఆయా ప్రాంతాలు ఇంకా కోలుకోనేలేదు కానీ మంగళ, బుధ వారాలలో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్‌ తుపాను సోమవారం సాయంత్రం తిరిగి వాయుగుండంగా మారింది. ఇది దక్షిణి ఒడిశా, ఉత్తర ఏపీ నుంచి పశ్చిమ దిశగా గంటకు 8 కిలో మీటర్ల వేగంతో కదులుతోండగా.. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం, అక్కడ నుండి అల్పపీడనంగా మారనున్న గులాబ్ తుఫాన్ తో పాటు దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విశాఖ పట్నం మీదుగా ఉన్న రుతుపవన ద్రోణి ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

వాయుగుండం, రుతుపవన ద్రోణి ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, నేడు తెలంగాణలోని నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు