Hyderabad Rains: కదల్లేక మెదల్లేక జనాలు.. వరదనీరు.. ట్రాఫిక్‌తో కిక్కిరిసిన రోడ్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం పడుతోంది. చాలా ఏరియాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. శుక్రవారం నగరంలో మొదలైన ఈ భారీ వర్షం శనివారం మధ్యాహ్నం వరకు కాస్త..

Hyderabad Rains

Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం పడుతోంది. చాలా ఏరియాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. శుక్రవారం నగరంలో మొదలైన ఈ భారీ వర్షం శనివారం మధ్యాహ్నం వరకు కాస్త తెరిపించి మళ్ళీ మొదలైంది. శనివారం ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షం.. నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపుల్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్య పురి, దిల్‎సుఖ్‎నగర్, మలక్ పేట, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో దంచి కొట్టింది.

Heavy Rains in Hyderabad: ఇంకా ముంపులోనే హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు

దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా.. జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జీహెచ్ఎంసి అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. మధ్యాహ్నం నుండి జల్లులతో మొదలైన వర్షం సాయంత్రానికి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. న‌గ‌రంలో మ‌ధ్యాహ్నం నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించిన జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు.

Hyderabad Heavy Rains : సినిమా ధియేటర్లోకి వర్షపు నీరు… గోడ కూలి 50 బైక్ లు ధ్వంసం

అయితే, ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు జలమయమవడంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఆఫీసులను ప్రజలు ఇళ్లకు చేరుకొనే సమయం కావడం.. అదే సమయంలో భారీ వర్షంతో వర్షపు నీరు రోడ్ల మీదకి చేరడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు కదల్లేక మెదల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందుగా అప్రమత్తమైన అధికారులు, సహాయక బృందాలు ఎక్కడిక్కడ నీటిని పంపిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసినందుకు శాయశక్తులా శ్రమించడంతో కొంత మేర ఉపశమనం కలిగింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అత్యవసరమైతేనే రోడ్ల మీదకి ప్రజలు రావాలని అధికారులు కోరుతున్నారు.