Weight Loss Diet
weight loss die : బరువు తగ్గాలని అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరు కోరుకుంటారు.కానీ జీవన శైలిలో వచ్చిన మార్పులు..తినే ఆహారం, ఒత్తిడి వెరసి అధిక బరువులకు కారణమవుతోంది. కానీ బరువు తగ్గాలి అనే కోరిక ఉన్నా..ఎక్సర్ సైజులు చేయటం, వాకింగ్ చేయటం, అలా కొన్ని రకాల ఆహారాలను మానివేయటం వంటివి సాధ్యం కాక బరువు తగ్గాలనే ఆలోచననే మానేసుకోవటం చాలామందికి అలవాటైపోయింది. బరువు తగ్గటం అంటే నాజూగ్గా ఉండటం ఒక్కటే కాదు..ఆరోగ్యంగా..ఫిట్ నెస్ గా ఉండటం. ఇది చాలా అవసరం కూడా.కానీ ఎలా అనేది పెద్ద ప్రశ్నగా..పెద్ద సమస్యగా తయారైంది. కానీ మనం తగ్గించుకోవాల్సింది శరీ బరువు కాదు..శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వుని తగ్గించుకోవాలి. పేరుకుపోయిన అధిక కొవ్వు ఓ బంతిలాగా తయారైన ఇబ్బంది కలిగిస్తుంది.అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.
కానీ దాన్ని కొన్ని రకాల అలవాట్లతో కొవ్వును కరిగించుకోవచ్చు. కొవ్వు కరిగించుకంటే కుంటే శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. అలాగే ఓ పక్క బరువు తగ్గుతు శరీరంలో పోషకాల శాతం తగ్గకుండా చూసుకోవాలి.అప్పుడే ఆరోగ్యవంతమైన ఫిట్ నెస్ వస్తుంది. దాని కోసం ప్రతీరోజు ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే కూరగాయాలను భాగంగా చేసుకోవాలి.పాలు, గుడ్లు, మాంసం, చిరు ధాన్యాలు వంటివి ప్రతీరోజు తీసుకోవాలి. మరి మీరు బరువు తగ్గించుకోవటానికి తీసుకునే ఆహారం మీ బరువును తగ్గిస్తుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా
అలా మీరు తీసుకునే ఆహారాలు మీ బరువును తగ్గిస్తుందో లేదో ఈ ఐదు మార్గాల ద్వారా తెలుసుకోండి..
1.మీరు తీసుకునే ఆహారం నిజంగానే మీ బరువును తగ్గిస్తోందా?అని పరిశీలించుకోవాలి.ముఖ్యంగా మనం ధరించే బట్టలు మీకా విషయాన్ని చెబుతాయి. గతంలో అంటే మీరు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకున్న బట్టలు అప్పుడు టైటుగా ఉండి ఇప్పుడు సరిగ్గా సరిపోతే మీరు బవుతు తగ్గుతున్నట్లు లెక్క. ముఖ్యంగా జీన్స్, టైట్ టీ షర్టులు వేసుకున్నప్పుడు మార్పులు తెలుస్తాయి.
2.గతంలో చిన్న చిన్న పనులు చేసిన అలిసిపోయే మీరు ఇప్పుడు హాయిగా పనిచేయగలిగేలా ఉండటం. పైగా పనిచేసినా అలసట రాకపోవటం వంటివి తెలుస్తాయి.
3. శరీరంలో కొవ్వు కరిగితే చక్కటి నిద్ర పడుతుంది. మీరు తీసుకునే ఆహారం మీ హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇవి రాత్రి నిద్రమీద ప్రభావం చూపుతాయి. మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకుని చక్కటి ఆహారం తీసుకుంటే చక్కటి నిద్ర పడుతుంది.నిద్ర బాగా పట్టటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్ర శరీరంపై బాగా ప్రభావం చూపుతుంది.నిద్ర శరీర బరువుపై పెను ప్రభావం చూపుతుంది. అధిక నిద్ర వల్ల బరువు పెరుగుతాం. అలాగే చక్కటి ఆరోగ్యం ఉంటే సరైన సమయంలో తగినంత నిద్ర వస్తుంది. నిద్రపోయే సమయంలో విడుదల అయ్యే కొన్ని హార్మోన్లు ఫ్యాట్ లాస్ కు ఉపయోగపడతాయి. అలాగే అధిక నిద్ర బరువు పెరుగుదలకు కారణమవుతుంది. ఈక్రమంలో ఆహారంలో చేసుకున్న మార్పులు మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. మంచి ఆహారం చక్కటి నిద్రకు ఉపయోగపడుతుంది.
4. సరైన ఆహారం తీసుకోవటం శరీరానికి శక్తిని చేకూర్చటంతో పాటు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యంగా ఉంటే మానసిక స్థితి బాగుంటుంది. సరైన ఆహారం కండరాలు, ఎముకల బలాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది, అంతేకాదు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
5. మీ శరీరం అంతర్గతంగా బాగా పనిచేస్తుందనటానికి బ్లడ్ టెస్టుల్లో కనిపించటమే దానికి నిదర్శనం.అలాగే మంచి ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు సరైన పరిమాణంలో ఉంటాయి. ఐరన్, యూరిక్ యాసిడ్ స్థాయిలు అన్నీ సాధారణ పరిధిలో ఉంటాయి.
కాబట్టి బరువు తగ్గడం అనేది ఓ టార్గెట్ గా కాకుండా మంచి ఆహారాన్ని తీసుకోవటంపై దృష్టి పెట్టాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరంలో ఉండే అధిక కొవ్వు అదే కరిగిపోతుంది. దీనికి వ్యాయామం కూడా జత చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. బరువు తగ్గడంలో మాయాజాలం లేదు. తిండి తినటం మానేస్తే బరువు తగ్గరు. పైగా లేనిపోయిన అనారోగ్యాలు వస్తాయి. మంచి ఆహారం..సరైన వ్యాయామం ఆరోగ్యానికి ఉపయోగపడతాయనే విషయం తెలుసుకోవాలి. మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్నిస్తుంది.