చిరంజీవి, రామ్ చరణ్ పై తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ

  • Publish Date - May 31, 2020 / 08:03 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ సంస్థాన వారసులు, మాజీ ఐఎఎస్‌ అధికారి, చరణ్ భార్య ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా కుటుంబ సభ్యులు హారజరయ్యారు. ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వెంకటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనను ప్రమాదం నుంచి తప్పించారు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లడంతో వారంతా తేనెటీగల దాడి నుండి తప్పించుకున్నారు.

దహన సంస్కారాల సమయంలో తేనెటీగల దాడి:
అనారోగ్యంతో కామినేని ఉమాపతిరావు ఈ నెల 27న మృతి చెందారు. ఇవాళ(మే 31,2020) దోమకొండ గడీకోటలోని లక్ష్మీబాగ్‌లో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి దోమకొండకు వచ్చారు. అంత్యక్రియల కార్యక్రమం సాగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న చెట్టుపై నుండి తేనేటీగలు దాడికి దిగాయి. తేనెటీగలు ఒక్కసారిగా రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. 

పలువురికి స్వల్ప గాయాలు:
తేనెటీగలు కుట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో జిల్లా కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తేనెటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. కామినేని ఉమాపతిరావు మనవరాలే చిరంజీవి కోడలు ఉపాసన.