Triphala Churnam : వాత,పిత్త, కఫా దోషాలను పోగొట్టే త్రిఫల చూర్ణం తయారీ ఎలాగంటే!

కాలేయ పనితీరును మెరుగు పరచటంలో త్రిఫల చూర్ణం బాగా ఉపకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంతోపాటు రక్త సరఫారా బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని విషపదార్ధాలను తొలగించటంతోపాటు బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అజీర్ణ సమస్యలను పోగొడుతుంది. శిరోజాలకు మేలు చేస్తుంది.

Triphala Churnam : పురాతన మూలికా ఔషధంగా త్రిఫల చూర్ణాన్ని చెప్పవచ్చు. మూడు రకాల పండ్లతో తయారు చేసిన పొడినే త్రిఫల చూర్ణంగా చెప్తారు. ఉసిరి, కరక్కాయ, తానికాయలతో ఈ త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తారు. వాత, పిత్త, కఫా దోషాలను నివారించటంలో త్రిఫల చూర్ణం బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతుంది. త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి కషాయంగా, పాలు లేదా తేనెతో కలిపిగాని తీసుకోవచ్చు.

కాలేయ పనితీరును మెరుగు పరచటంలో త్రిఫల చూర్ణం బాగా ఉపకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంతోపాటు రక్త సరఫారా బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని విషపదార్ధాలను తొలగించటంతోపాటు బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అజీర్ణ సమస్యలను పోగొడుతుంది. శిరోజాలకు మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడే త్రిఫల చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

త్రిఫల చూర్ణం తయారీ విధానం ;

త్రిఫల పొడి తయారు చేయడానికి ముందుగా ఉసిరి కాయలు 150గ్రాములు, కరక్కాయ 100గ్రాములు, తానికాయ 60గ్రాముల చొప్పున తీసుకోవాలి. ముందుగా ఉసిరి కాయ,కరక్కాయ, తానికాయ, తీసుకుని ఎండలో 4 రోజులు ఉంచి బాగా ఎండబెట్టండి. మూడు రోజులు బాగా ఎండిన తరువాత ఉసిరి కాయ,కరక్కాయ, తానికాయలో ఉన్న విత్తనాలను తొలగించి ఉసిరి కాయ,కరక్కాయ, తాన కాయను సన్నగా కోసి మరలా 2 రోజుల పాటు ఎండలో ఉంచాలి. మూడు వస్తువులను బాగా ఎండబెట్టిన తరువాత, ఈ వస్తువులన్నింటినీ పాన్ లో కొంచెం సేపు వేయించాలి. తరువాత మిక్సీలో లో ఒక్కొక్కటిగా వేసి సన్నగా గ్రైండ్ చేయండి. దీంతో త్రిఫల చూర్ణం రెడీ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు