9P లెన్స్‌ 108MP కెమెరాతో Huawei Mate 40 సిరీస్‌ వస్తోంది

  • Publish Date - June 17, 2020 / 09:37 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే తన Mate 40సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అక్టోబర్‌లో రిలీజ్ చేయనుంది. లాంచింగ్‌కు కొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపే హువావే Mate 40 సిరీస్ ఫీచర్లపై సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. హువావే మేట్ 40-సిరీస్ ప్రధాన కెమెరా 108 MP భారీ కెమెరాతో రాబోతుందంటూ వినిపిస్తోంది. 

IT Home blog ప్రకారం.. హువావే సప్లయ్ చైనాలోని సిబ్బంది ప్రస్తుతం కొత్త 108MP లెన్స్ ఉందని అంటోంది. దీని ఆప్టికల్ పనితీరు బాగా మెరుగుపడిందని చెబుతున్నారు. Mate 40, Mate 40 Pro స్మార్ట్‌ఫోన్‌లలో లభిస్తుందని తెలిపారు. 
ఫోన్‌ల రేంజ్ 9P లెన్స్‌ ఉపయోగించి 108 MP సెన్సార్‌లతో వస్తోంది. ఇతర ప్రామాణిక లెన్స్‌లతో పోల్చితే ఫొటోలను ప్రాసెస్ చేసే లెన్స్ సామర్థ్యం బాగా మెరుగుపడిందని తెలిపారు.

రాబోయే హువావే సిరీస్ కెమెరా యూనిట్ కూడా చాలా మెరుగుపడిందని యూజర్లను ఆకర్షించేలా ఉంటుందని సిబ్బంది అభిప్రాయపడ్డారు. PhoneArena నివేదిక ప్రకారం.. కొత్త 5-నానోమీటర్ తయారీ ప్రక్రియపై నిర్మించిన కిరిన్ 1020 చిప్‌సెట్‌తో Mate 40 సిరీస్ వస్తుందని, ఇది మార్కెట్లో అత్యంత వేగవంతమైన చిప్‌లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు.

2020 నాల్గవ త్రైమాసికంలో ఫ్లాగ్‌షిప్ హువావే Mate 40 సిరీస్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోందని Weiboపై ఓ లీక్‌స్టర్ పేర్కొంది. ఈ లాంచ్ మేట్ 30 ఇంట్రడక్షన్ షెడ్యూల్ ఆలస్యం కానుంది. సెప్టెంబర్ 2019లో ఆవిష్కరించినప్పటికీ ఈ ఏడాదిలో COVID-19 మహమ్మారి కారణంగా ఆలస్యమైనట్టు పేర్కొంది. 

Read: ట్విట్టర్‌ను దాటేస్తోంది ఇన్‌స్టాగ్రామ్.. ఎందులో తెలుసా?