Wonder Bike Rider : వందేళ్ల బామ్మ వండర్ బైక్ రైడ్

Wonder Bike Rider : బైక్ లపై రయ్ మంటూ దూసుకుపోవటమంటే కుర్ర కారుకు యమ క్రేజ్… మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఏ బైక్ ను వదిలిపెట్టరు.. ఒక్కసారైనా దానిపై చక్కర్లు కొట్టాలన్న కుతుహలంతో ఉంటారు. కుర్రకారు సంగతి పక్కనపెడితో 100 ఏళ్ళకు చేరువలో ఉన్న ఓబామ్మ బైక్ పై చలాకీగా చక్కర్లు కొడుతుంది. బామ్మ బైక్ రైడింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

యమహా R15 బైక్ పై కూర్చొని స్టైల్ గా బామ్మ బండి నడుపుతున్న దృశ్యాలు చూసి నెటిజన్లు ఆశ్ఛర్యపోతున్నారు. కాటికి కాళ్ళు చాపే వయస్సులో చేతిలో కర్రపట్టుకుని తిరుగాల్సిన బామ్మ ఇలా బైక్ రైడర్ గా మారటాన్ని చూసి లైకులతో ముంచెత్తుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో బామ్మ బైక్ నడుపుతున్న వీడియో వైరల్ గామారింది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 7కోట్ల 80లక్షల మందికి పైగా వీక్షించగా, లక్షల మంది లైక్ లు, కామెంట్లు పెట్టారు. దీంతో వందేళ్ళ బామ్మ బైక్ రైడింగ్ దృశ్యాలు వండర్ గా మారాయి. అయితే ఇన్ స్టా వీడియోకు కొంత మంది బామ్మ నిజంగా డ్రైవింగ్ చేయటంలేదు. ఎవరో బైక్ పక్కనుండి తోస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొంత మంది మాత్రం బామ్మ సాహసాన్ని చూసి మెచ్చకుంటున్నారు. బైక్ పై బామ్మ దాది స్టైల్ చూసి వావ్ దాది అంటూ కితాబులిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మట్టిరోడ్డుపై నల్లని బైక్ పై బామ్మ రైడింగ్ దృశ్యాలు చూపరులను ఆశ్ఛర్య పోయేలా చేస్తున్నాయి.

వాస్తవానికి వందేళ్ళ వయస్సులో బైక్ ఎక్కటమే పెద్ద సాహసం.. ఎందుకంటే ఆ వయస్సులో పెద్ద వయస్సు వారు అలాంటి సాహసాలు చేసేందుకు ఇష్టపడరు. అయితే బామ్మ మాత్రం సరదాగా బైక్ పైన కూర్చొని ముసిముసినవ్వులు చిందిస్తూ రైడింగ్ చేస్తున్నట్లు ఫోజులివ్వటం అంటే ఆసక్తిగానే ఉంటుంది మరీ..

ట్రెండింగ్ వార్తలు