Hyd Drugs Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసు.. టెకీలకు కిక్కిస్తోన్న కంపెనీలు..!

Hyd Drugs Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసు.. టెకీలకు కిక్కిస్తోన్న కంపెనీలు..!

Hyderabad Drugs Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక అంత కదిలినట్టయింది. సెలబ్రిటీలతో మొదలైన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల వరకు వెళ్లింది. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల మెడకు చుట్టుకుంది. డ్రగ్ రాకెట్ తో సంబంధాలు కలిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. డ్రగ్స్‌తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన ఐటీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నాయి పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.

డ్రగ్స్‌ కేసులో చిక్కుకున్న టెకీలను ఉద్యోగాల నుంచి పీకి పారేస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు ఐటీ కంపెనీలు 13 మందిపై వేటు వేశాయి. మరికొంతమందిని త్వరలోనే ఉద్యోగాల నుంచి తీసేసి ఇంటికి పంపించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో పలువురు ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వారందరిపై ఆయా ఐటీ కంపెనీలు వేటు వేశాయి.

టెకీలకు డ్రగ్స్, గంజాయి అమ్మినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ఈ డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లు పోలీసుల విచారణలో బయటపెట్టారు. డ్రగ్స్ లింక్ కలిగిన ఉన్న ఐటీ ఉద్యోగులను ఉద్యోగంలో నుంచి కంపెనీలు తీసేస్తున్నాయి. 50 మందికి పైగానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు నోటీసులిచ్చినట్లు తెలిసింది.

నగరంలో డ్రగ్స్‌ సరఫరా చేసే లక్ష్మీపతి నుంచి టెకీలు డ్రగ్స్‌, హాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. లక్ష్మీపతి కస్టమర్లలో పదుల సంఖ్యలో టెకీలు ఉన్నట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. మిగిలిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అందరికీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదివరకే చాలామంది తమ పేర్లనూ రివీల్ చేశారు. డ్రగ్స్‌ తీసుకున్న వారికి నోటీసులిచ్చేందుకు నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సిద్ధమయ్యారు.

Read Also : Hyd Drugs Case: మత్తు దందా కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు