5.5 Kg Gold Seized in Shamshabad : 5. 5 కిలోల బంగారాన్ని పేస్టులా మార్చి తరలింపు .. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. 5.5కిలోల బంగారాన్ని పేస్టులా మార్చి తరలిస్తున్న ఇద్దరు ప్రయాణీకులను కష్టమ్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

5.5 KG gold Seized in shamshabad airport : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. 5.5కిలోల బంగారాన్ని పేస్టులా మార్చి తరలిస్తున్న ఇద్దరు ప్రయాణీకులను కష్టమ్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని పేస్టులా మార్చి అక్రమంగా తరలించేదుకు యత్నించారు. సదరు ప్రయాణీకులపై కస్టమ్స్‌ అధికారులకు వారిపై అనుమానం రావడంతో తనిఖీ చేశారు. దీంతో అసలు బండారం బయటపడింది. బంగారాన్ని పేస్టులా మార్చి పర్సుల్లో అమర్చుకున్నారు.

వారివద్ద ఉన్న పర్సుల్లో పేస్టు రూపంలో ఉన్న బంగారం పట్టుడింది. దీంతో అక్రమంగా తరలిస్తున్న పసిడిని అధికారులు సీజ్‌ చేశారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇద్దరు దుబాయ్‌ ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తరచు బంగారం పట్టివేత జరుగుతుంటుంది. విదేశాల నుంచి ముఖ్యంగా దుబాయ్ వంటి దేశాలనుంచి వచ్చేవారు అక్కడనుంచి బంగారం తీసుకొస్తుంటారు. ఈ బంగారం తరలింపుల్లో పలు నిబంధనలు..ఆంక్షలు ఉన్నా ఈ తరలింపులు జరుగుతునే ఉంటాయి. ఈక్రమంలో అనుమానాస్పదంగా ఉన్నవారిపై కన్నేసే కష్టమ్స్ అధికారులు అక్రమంగా తరలింపులకు చెక్ పెడుతున్నారు. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు