Hyderabad CP : చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు
చిక్కడపల్లి ఠాణా సీఐ పాలడుగు శివశంకర్‌రావు, అశోక్‌నగర్ సెక్టార్ ఎస్‌ఐ నర్సింగరావులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు
- kunduru Vinod
- Published On : November 24, 2021 / 12:30 PM IST
Hyderabad Cp
Hyderabad CP : ఓ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిక్కడపల్లి ఠాణా సీఐ పాలడుగు శివశంకర్‌రావు, అశోక్‌నగర్ సెక్టార్ ఎస్‌ఐ నర్సింగరావులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. వీరితోపాటు మరో ఎస్ఐ పీ. నాగరాజు గౌడ్‌ని కూడా సీపీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. నాగరాజు గౌడ్ ప్రస్తుతం సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక అస్థిరత ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
చదవండి : SI Suspended : ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఎస్ఐ.. సస్పెండ్ చేసిన సీపీ
గత వారం చిక్కడపల్లి పీఎస్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను సీసీఎస్‌కు వెళ్లాలని చెబుతూ కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్లు తేలింది. తమకు స్టేషన్‌లో న్యాయం జరగడం లేదని బాధితులు సీపీని కలవడంతో శాఖాపరమైన విచారణ జరిగిపించారు. విచారణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు సీపీ.
చదవండి : Maripeda SI Suspend : మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు .. మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్
