Hyderabad Metro: మియాపూర్‌ -LB నగర్ రూట్లో 30 నిమిషాలకు పైగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు..

హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. మియాపూర్‌-ఎల్బీ నగర్‌, ఎల్బీనగర్‌-మియాపూర్ మార్గాల్లో అరగంటకు పైగా సేవలు మెట్రో రైళ్లు నిలిచిపోయారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడటానికి..మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు రైళ్లు నిలిచిపోయవంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైలు ఆగిపోయి 30 నిమిషాలు గడుస్తున్నా ఇంకా కదలకపోవటంతో కొంతమంది ప్రయాణీకులు రైతు దిగి వెళ్లిపోయారు.

Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. మియాపూర్‌-ఎల్బీ నగర్‌, ఎల్బీనగర్‌-మియాపూర్ మార్గాల్లో అరగంటకు పైగా సేవలు మెట్రో రైళ్లు నిలిచిపోయారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడటానికి..మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు రైళ్లు నిలిచిపోయవంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైలు ఆగిపోయి 30 నిమిషాలు గడుస్తున్నా ఇంకా కదలకపోవటంతో కొంతమంది ప్రయాణీకులు రైతు దిగి వెళ్లిపోయారు.

కానీ 30నిమిషాలకు పైగా రైళ్లు నిలిచిపోవటం..ఆ తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి. సేవలకు అంతరాయం కలగడంతో ఆయా మార్గాల్లో వెళ్తున్న రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు మార్గంమధ్యలోనూ ఆగిపోయాయి.

రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కొద్దిసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని.. సహకరించాలని మెట్రో రైలు సిబ్బంది అనౌన్స్‌ చేశారు. అనంతరం పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి. మెట్రో రైళ్లు 30 నిమిషాలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. కానీ సమయానికి వారి వారి గమ్యాలకు చేరుకోవాలని మెట్రో రైళ్లను ప్రయాణాలకు ఎంచుకుంటే ఇటువంటి తరచు ఏర్పడటంతో ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు