Hyderabad To Andhra: ట్రావెల్స్ బస్సులో పట్టుబడిన కోటివిలువైన వజ్రాభరణాలు!

హైదరాబాద్ నుండి వెళ్తున్న బస్సులలో తరచుగా అక్రమ నగదు పట్టుబడడం సంచలనం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో పోలీసుల తనిఖీలలో పరుగు రాష్ట్రాలకు వెళ్తున్న సొత్తు బయటపడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సులో భారీగా బంగారు, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి.

Hyderabad To Andhra: హైదరాబాద్ నుండి వెళ్తున్న బస్సులలో తరచుగా అక్రమ నగదు పట్టుబడడం సంచలనం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో పోలీసుల తనిఖీలలో పరుగు రాష్ట్రాలకు వెళ్తున్న సొత్తు బయటపడుతుంది. గత శనివారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఒక ప్రయాణికుడి నుండి రూ.3 కోట్లకుపైగా నగదు లభించింది. మరో ప్రయాణికుడి వద్ద కిలో బంగారం లభించింది. పట్టుబడిన నగదు చెన్నైలోని రామచంద్ర మెడికల్‌ కాలేజీకి చెందినది కాగా.. బంగారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాప్‌కు సంబంధించిందిగా అధికారులు గుర్తించారు.

పట్టుబడిన బంగారం, నగదుకు సంబంధించి ఆధారలైతే లభించాయి కానీ అంత పెద్ద ఎత్తున సొత్తు బయటపడడం మాత్రం సంచలనమైంది. అదలా ఉండాగానే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సులో భారీగా బంగారం, వజ్రాలు పట్టుబడ్డాయి. ఏపీ‌, తెలంగాణ సరిహద్దుల్లోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ సొత్తు బయటపడింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రూ.1.04 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు గుర్తించారు.

పట్టుబడిన బంగారం, వజ్రాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేసి అధికారులకు అప్పగించారు. కాగా వీటిని హైదరాబాద్‌ నుంచి మధురై తరలిస్తున్నట్లుగా విచారణలో తేలగా ఈ తరలింపులో పోలీసులు ఇద్దరని అరెస్టు చేశారు. శనివారం అంత మొత్తంలో నగదు, బంగారం బయటపడడం.. నాలుగు రోజులు తిరిగేసరికి మరోసారి భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు బయటపడడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు