Lock-down: హైదరాబాద్-విజయవాడ హైవే.. టెన్షన్ పెడుతున్న 25 కిమీ ప్రయాణం!

తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన ప్రభుత్వం నేటి నుండి సాయంత్రం 5 వరకు సడలింపులు ఇచ్చింది. అయితే.. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలలో మాత్రం లాక్ డౌన్ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.

Lock-down: తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన ప్రభుత్వం నేటి నుండి సాయంత్రం 5 వరకు సడలింపులు ఇచ్చింది. అయితే.. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలలో మాత్రం లాక్ డౌన్ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయాన్ని సడలించినప్పటికీ కొవిడ్‌ ఉద్ధృతంగా వున్న సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 2 నుండే లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది.

దీంతో ఇప్పుడు హైదరాబాద్ – విజయవాడ వైపు ప్రయాణించే వారికి ఇది టెన్షన్ గా మారుతుంది. విజయవాడ హైవే నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి కాగా సడలించిన లాక్ డౌన్ నిబంధనలతో ఈ రహదారిలో మరింత రద్దీ పెరగనుంది. అయితే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో కరోనా కేసుల దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట నుండే లాక్ డౌన్ అమలు కానుంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి ఈ మండలంలో నుండి 25 కిమీ పైనే ఉంటుంది. దీంతో ఈ రోడ్డుపై మధ్యాహ్నం తర్వాత వెళ్లే వారికి జరిమానాలు విధిస్తారా అనే అనునామాలు వ్యక్తమవుతున్నాయి.

చౌటుప్పల్ మండలం నుండి ఏపీ వైపు నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాలు ఉండగా.. ఇటు హైదరాబాద్ వైపు రంగారెడ్డి జిల్లా ఉంటుంది. కనుక ఏపీలో విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వచ్చే వాహనాలు చౌటుప్పల్ మీదుగా రానున్నాయి. దీంతో ఇక్కడ మధ్యాహ్నం నుండే లాక్ డౌన్ అమల్లో ఉండడంతో స్థానిక ప్రజలతో పాటు ఈ రహదారిఫై ప్రయాణించే వారికి జరిమానాలు విధిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై స్థానిక అధికారులు ఏమైనా సూచనలు చేస్తారేమో చూడాల్సిఉంది.

ట్రెండింగ్ వార్తలు