Tonsils Problem : గొంతుకు రక్షక భటులుగా పనిచేసే టాన్సిల్స్ సమస్య ఉత్పన్నమైతే శస్త్ర చికిత్స తప్పనిసరా!
టాన్సిల్స్ ఎరగ్రా వాపుగా కన్పిస్తాయి. గొంతునొప్పి, చెవినొప్పి, తలనొప్పి జలుబుతో జ్వరం 101 డిగ్రీల నుండి 103 డిగ్రీల ఫారన్‌హీట్‌ల వరకు ఉంటుంది. ఆహారం మింగటం, నీరు తాగటం, గాలి పీల్చడం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురు పోవడం, గొంతు తడారిపోయి గొంతు ఎరబ్రడడం, నోరు దుర్వాసన వస్తుంది.
- Guntupalli Ramakrishna
- Published On : August 15, 2022 / 02:38 PM IST
tonsils
Tonsils Problem : టాన్సిల్స్ అనేవి గొంతులో ఇరు పక్కల ఉండి మన శరీరానికి రక్షకభటు లుగా పనిచేస్తాయి. బయట నుండి వచ్చే సూక్ష్మక్రిములను, కాలుష్య కారక పదార్థాలను శరీరంలోకి రాకుండా నివారించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చల్లగాలిలో తిరగడం వలన టాన్సిల్స్ సైజు పెరిగి గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. ఇలాంటి కారణంగా గొంతునొప్పి ప్రారంభమయి, మింగటం కష్టంగా మారి గొంతు మంటమండుతుంది. దాహం విపరీతంగా ఉండి జ్వరంతో బాధపడుతుంటారు.
చాలా మంది చిన్న పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. టాన్సిల్స్ సైజు పెరిగి వాపు రావడం వలన గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఎక్కువ కావడం వలన టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్‌కు గురెై గొంతునొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడం వల్ల టాన్సిల్స్ సమస్య వేధిస్తుంది.
టాన్సిల్స్ ఎరగ్రా వాపుగా కన్పిస్తాయి. గొంతునొప్పి, చెవినొప్పి, తలనొప్పి జలుబుతో జ్వరం 101 డిగ్రీల నుండి 103 డిగ్రీల ఫారన్‌హీట్‌ల వరకు ఉంటుంది. ఆహారం మింగటం, నీరు తాగటం, గాలి పీల్చడం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురు పోవడం, గొంతు తడారిపోయి గొంతు ఎరబ్రడడం, నోరు దుర్వాసన వస్తుంది. నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయి.
వ్యాధి తీవ్రత తగ్గాలంటే చల్లటి గాలిలో తిరుగకూడదు. కలుషిత నీటిని తాగకుండా, కాచి వడపోసిన నీటిని తీసుకోవడం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుంది. చల్లటి పానీయాలను, ఐస్‌క్రీములు, బేకరీ ఫుడ్స్ తీసుకోకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చన్నీళ్ల స్నానం చేయకూడదు. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
టాన్సిలెైటీస్‌కు శస్తచ్రికిత్స అవసరం లేకుండానే సమస్యను నివారించే మంచి చికిత్స హోమియోవెైద్యంలో ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణలోకి తీసుకొని మందులను ఎంచుకుని వెైద్యం చేస్తే టాన్సిలెైటీస్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. టాన్సిల్స్‌ను శస్తచ్రికిత్స చేసి తొలగించకుండా సమస్య వచ్చినప్పుడు హోమియో మందులను వాడి శస్త్ర చికిత్స లేకుండానే సమస్య నుండి బయటపడవచ్చు.
