Mashrooms : పుట్టగొడుగుల్లో ఔషదగుణాలు తెలిస్తే..అస్సలు వదలిపెట్టరు..
బరువు తగ్గాలనుకునేవారు పుట్టగొడుగులను రోజు వారి ఆహారంలో భాగం తీసుకోవటం మంచిది. ఇందులో 90శాతం వరకు నీరు ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 26, 2021 / 04:57 PM IST
Mushroom
Mashrooms : శాకాహార ప్రియులు, మాంసాహార ప్రియులు ఎక్కవగా ఇష్టపడే అహారం పుట్టగొడుగులు. వర్షాకాలంలో సహజ సిద్దమైన పుట్టగొడుగులు అధికంగా లభిస్తాయి. పుట్టలవద్ద దొరికే ఈ పుట్టగొడుగులు మంచి రుచితోపాటు, పోషకాలను కలిగి ఉంటాయి. ఇర్గోధియోనైన్, సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు పుట్టగొడులల్లో లభిస్తాయి. గుండె జబ్బులు, పక్షవాతం, కాన్సర్ వంటి వ్యాధులను రాకుండా అడ్డుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.
బరువు తగ్గాలనుకునేవారు పుట్టగొడుగులను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది. ఇందులో 90శాతం వరకు నీరు ఉంటుంది. అధిక రక్తపోటును నివారించి పక్షవాతం రాకుండా అరికట్టేందుకు ఉపకరిస్తాయి. డి విటమన్ ఉండటం వల్ల ఎముకలు, దంతాలు పటుత్వంగా ఉంటాయి. శరీరంలో ఎర్రకణాల ఉత్పత్తికి తోడ్పడటంతోపాటు, ఇందులో ఉండే మాంసకృత్తులు మజిల్ పవర్ పెరిగేందుకు ఉపయోగపడతాయి.
వారంలో ఐదురోజుల పాటు రోజుకు 200 గ్రాముల చొప్పున పుట్టగొడుగులు ఆహారంలో భాగంగా తీసుకుంటే అనారోగ్య కారాలైన వైరస్, బ్యాక్టీరియాల నుండి మనం రక్షణ పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో నిరంతరం పుట్టగొడుగులు లభిస్తున్నాయి. చిన్నారుల నుండి పెద్దల వరకు పుట్టగొడుగులను కూర గా చేస్తే ఇష్టంగా లాగించేస్తారు. ఎన్నో ఔషదగుణాలతోపాటు, ఆరోగ్యానికి మేలు చేకూర్చే పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది. వర్షాల సీజన్ నేపధ్యంలో సహజ సిద్ధంగా లభిస్తున్న పుట్టగొడుగులను తినటం మర్చిపోవద్దు.
