Ilaa Ilaa song : ‘తలైవి’ వీడియో సాంగ్ చూశారా!.. కంగనా అదరగొట్టేసింది..

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయ, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.

  • Updated on- April 2, 2021 / 04:20 PM IST

Ilaa Ilaa Song From Thalaivi

Ilaa Ilaa song: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయ, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సినిమాలో నుండి ‘ఇలా ఇలా’ అనే వీడియో సాంగ్ స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేశారు. జి.వి.ప్రకాష్ కుమార్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరాశ్రీ లిరిక్స్ రాశారు. సైంధవి చాలా చక్కగా పాడారు. బృంద మాస్టార్ కొరియోగ్రఫీ చేశారు.

పాటలో కంగన రెట్రో అండ్ మోడర్న్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ‘తలైవి’ సినిమాను ఏప్రిల్ 23న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా : విశాల్ విఠల్, నిర్మాణం : విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్.