Immunity Boosters: మీ వంటింట్లోనే దొరికే ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలివే!

డాక్టర్లు తరచుగా 'మీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది' అంటుండటం మీరు వినే ఉంటారు. ఈ కారణంగానే దగ్గు, జలుబు, ఇతర రోగాల త్వరగా పడిపోతారు. ఇక ఇప్పుడు అసలే నడిచేది కరోనా కాలం. అందునా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే కరోనాను జయించడం చాలా కష్టమని వైద్యులే చెప్తున్నారు.

Immunity Boosters: డాక్టర్లు తరచుగా ‘మీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది’ అంటుండటం మీరు వినే ఉంటారు. ఈ కారణంగానే దగ్గు, జలుబు, ఇతర రోగాల త్వరగా పడిపోతారు. ఇక ఇప్పుడు అసలే నడిచేది కరోనా కాలం. అందునా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే కరోనాను జయించడం చాలా కష్టమని వైద్యులే చెప్తున్నారు. కరోనాను జయించాలంటే ముందుగా మీరు మీ వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని పదేపదే వినిపిస్తున్న మాట. అసలు ఇమ్యూనిటీతో రోగాలకు ఉన్న సంబంధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజానికి ఇమ్యూనిటీ మిమ్మల్ని వివిధ రకాల రోగాల నుంచి కాపాడుతుంది. వాతావరణం ఎలా ఉన్నా మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని చురుగ్గా ఉంచుకోవటం చాలా అవసరం.

కరోనా లాంటి వైరస్ ఉన్నా లేకపోయినా మీ వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే ఏ వ్యాధి మీ దరిచేరదు. మీరు తీసుకొనే ఆహరం, రోజు వారీ అలవాట్లే మీ వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అలాంటి ఇమ్యూనిటీని పెంచే ఆహారం.. అది కూడా ఎక్కడో వెతకాల్సిన పనిలేకుండా మీ వంటింట్లోనే దొరికే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. Cinnamon

మన సాంప్రదాయ భారతీయ వంటగదిలో ఈ దాల్చిన చెక్క సర్వసాధారణంగా ఉపయోగించే పదార్థమే. అయితే.. ఈ చెక్కతోనే మనం వ్యాధులను దరిచేరనీయకుండా ఉండగలమని మీకు తెలుసా? దాల్చినచెక్కలో యాంటీ-వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఈ పదార్ధం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలతో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది కనుక ఇది మానవ శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి, గట్ మెరుగుపరచడానికి, డయాబెటిస్ టైప్ 2, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడంలో ఇది సహాయపడుతుంది. దీనిని రోజువారీ వంటకాలతో పాటు, గోరువెచ్చని నీరు, డెజర్ట్‌లతో కలిపి తీసుకోవచ్చు. టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు.

2. Curry Leaves

Curry Leaves

కరివేపాకు లేకుండా మన వంట ప్రక్రియ పూర్తవడం అసాధ్యమే. అదే కరివేపాకు విరేచనాలు, మలబద్ధకం, మధుమేహం చికిత్సలో సహాయపడుతుంది. ఇది కంటి చూపు, హెయిర్ ఫాల్ రిపేర్, గాయాలను నయం చేయడం, కాలిన గాయాలు, చర్మ సంబంధ వ్యాధులలో టన్నుల కొద్దీ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ ఆకు బరువు నియంత్రణతో పాటు విటమిన్ ఎ, బి, సి మరియు బి 2 లను పుష్కలంగా అందిస్తుంది. విటమిన్ వృద్ధి ద్వారా నేడు మానవజాతిని పీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవచ్చు. కరివేపాకును ప్రతిరోజూ వంటలతో పాటు ఉదయం పూట నాలుగు పచ్చి ఆకులను తీసుకుంటే మరీ మంచిదట.

3. Garlic

Garlic

ల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వంటకి మంచి సువాసన ఇవ్వడం మాత్రమే కాదు. జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుర్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది. వీటిలో అలిసిన్, అజోయేన్, థయోసల్ఫేట్ వంటి పదార్థాలు ఇన్ఫెక్షన్స్‌తో పోరాడి వివిధ రకాల వైరస్‌లను చంపేస్తుంది. ఇది రక్తపోటును సరైన విధానంలో ఉంచి.. ధమనుల గట్టిపడకుండా నిరోధించడానికి సాయపడుతుంది. అప్పటి కాలంలో బ్యాక్టీరియా సంక్రమణ, ఫ్లూ నుండి బయటపడటానికి వెల్లుల్లిని ఉపయోగించొచ్చు. పచ్చి వెల్లుల్లిని ఒక గ్లాసు నీటితో కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎనలేని ఔషధంగా పనిచేస్తుంది.

4. Fenugreek

Fenugreek

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. మెంతులను ఇంగ్లీషులో ఫెనుగ్రీక్ గింజలు అంటారు. మెంతులలో కావలసినంత పీచు ఉండగా.. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి..అతి తక్కువ కేలరీల వలన స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. రాత్రిపూట ఒక టేబుల్ స్పూన్ మెంతులు నీటిలో నానబెట్టి, మరుసటి రోజు విత్తనాలతో పాటు త్రాగితే మీ ఇమ్యూనిటీ వేగంగా వృద్ధి చెందుతుంది.

5. Jaggery

Jaggery

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ బెల్లం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. తాతల కాలం నుంచి బెల్లాన్ని వంటల్లో ఉపయోగిస్తున్నారు. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. శరీరంలో వేడిని క్రమబద్ధీకరించే శక్తి బెల్లానికి ఉంది. ఓ కప్పు నీటిలో బెల్లం ముక్కను కలిపి తాగితే చాలు… బాడీ హీట్ సెట్టవుతుంది. బెల్లంలోని మొలాసిస్‌లో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్… మన శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. దాదాపు ఎనర్జీ డ్రింక్స్ లాగే. బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా నీటిని తాగాలి. ఆ నీటిలో కొద్దిగా బెల్లం వేసుకుంటే మంచిదే. బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉండగా,. శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు దోహదపడుతుంది. చక్కర బదులు ప్రతిదానిలో బెల్లాన్ని వాడుకుంటే మీ శరీరం వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్దమైనట్లే.

6. Turmeric

Turmeric

నిత్యం ఇంట్లో వంటల్లో ముఖ్య‌మైనది ప‌సుపు. ప‌సుపు లేకుండా వంట‌లు చేయ‌డానికి కుదరదు. ప‌సుపు వంట‌లే కాదు ఆరోగ్యానికి, అందాన్ని కాపాడాటానికి కూడా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. పసుపును ఎన్నో రోజులుగా అంటువ్యాధులతో పోరాడటానికి ఉపయోగించే వారు. పురాతన మందుల్లో ఎక్కువగా ఉండే కర్కుమిన్ సమ్మేళనం అధికంగా పసుపులో ఉంటుంది. అదే విధంగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయని రుజువు అయ్యింది. కడుపులో మంట చాలా రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆ మంటతో పోరాడేందుకు పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గుండె జబ్బులు, కాన్సర్, అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా పసుపు చాలా బాగా సహాయపడతాయి. నివారణ కంటే నిరోధన మంచిది -ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ అనే మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి, ఈ హెల్దీ ఫుడ్ తీసుకుని మీరు కూడా ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండండి..

7. Tulsi Leaves (Holy Basil)

Tulsi Leaves

తులసి బాసిల్ లేదా “మూలికల రాణి” అని పిలవబడుతుంది. ఇది అద్భుతమైన ఔషధ ఆయుర్వేద మూలిక. పురాతన కాలం నుంచి క్యాన్సర్, దగ్గుకు తులసి ఆకు మందులా వాడేవారు. అందుకే, ఇది ప్రపంచంలో ఆరోగ్యకరమైన హెర్బ్ అని పిలుస్తారు. ఎక్కువమంది భారతీయ కుటుంబాలలో ఔషధ, మత, ఆధ్యాత్మిక మరియు సౌందర్య విలువల కారణంగా తులసి చెట్టును వారి ఇళ్లలో పెంచుతారు. తులసి రసం శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. రిచ్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది స్ట్రెస్ బస్టర్, రక్తంలో చక్కెరను తగ్గిస్తూ, చర్మాన్ని సుసంపన్నం చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ తులసి తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యానికి మంచిది కూడా.

ట్రెండింగ్ వార్తలు