Imran Khan commends India
Pakistan: పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తూ ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వ పాలన తీరుపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ద్రవ్యోల్బణ ప్రభావం గురించి ఎలా ఉంటుందో పాకిస్థాన్ ప్రజలకు ఇప్పుడు తెలుస్తోందని చెప్పారు. షెహ్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వం పాక్‌లో విద్యుత్తు బిల్లును యూనిట్‌కి రూ.10 చొప్పున పెంచిందని ఆయన అన్నారు.
AP TET: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
తాము అధికారంలో ఉన్న సమయంలో ద్రవ్యోల్బణాన్ని ప్రకటించడంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒత్తిడిని తలొగ్గలేదని ఆయన చెప్పారు. పాక్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అతి తక్కువ సమయంలో ద్రవ్యోల్బణం శాతాన్ని భారీగా పెంచి చూపిందని, ఇటువంటి తీరు ప్రదర్శించడం దేశ చరిత్రలో మొట్టమొదటిసారని ఆయన విమర్శించారు. తమ పీటీఐ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయని అన్నారు. అయితే, తమ ప్రభుత్వ హయాంలోని ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు నిత్యావసరాల ధరలు మూడు రెట్లు పెరిగాయని ఆయన చెప్పారు.
Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం
పాక్ రూపాయి మారక విలువ దారుణంగా పడిపోయిందని గుర్తు చేశారు. అమెరికా డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ.202గా ఉందని చెప్పారు. దాని ప్రభావం బయటపడుతుందని తెలిపారు. ధరలు ఇంతగా పెరిగితే సాధారణ పౌరుడు కుటుంబాన్ని ఎలా పోషించుకోగలడని ఆయన నిలదీశారు. పీటీఐ అధికారంలో ఉన్న సమయంలో అసమర్థ ప్రభుత్వం అంటూ తమను విమర్శించారని, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరూ చూస్తున్నారని ఆయన అన్నారు. దేశం రుణాలు చెల్లించలేని స్థితికి చేరితే మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.