సిక్కింలో భారత్, చైనా బలగాల మధ్య గొడవ, పలువురికి గాయాలు

  • Publish Date - May 10, 2020 / 10:37 AM IST

భారత్, చైనా బలగాల మధ్య గొడవ జరిగింది. ఉత్తర సిక్కింలోని నాకూ లా ప్రాంతంలో పరస్పరం తలపడ్డాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో ఇరుదేశాల సైనికుల్లో పలువురికి గాయాలయినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో భారత్, చైనా బలగాల మధ్య దూకుడైన స్వభావంతో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పలువురు సైనికులు గాయపడ్డారు. స్థానిక స్థాయిలో మాటలు, పరస్పరం చర్యల తర్వాత దళాలు తప్పుకున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. 

సరిహద్దులు పరిష్కరించని కారణంగా తాత్కాలిక, స్వల్పకాలిక ఘర్షణలు జరుగుతుంటాయని వర్గాలు తెలిపాయి. ప్రోటోకాల్స్ ప్రకారం.. దళాలు ఇటువంటి సమస్యలను పరస్పరం పరిష్కరిస్తాయని పేర్కొన్నాయి. చాలాకాలం తర్వాత ఇలాంటి ఘటన చోటుచేసుకుందని తెలిపాయి. భారత్, చైనా దేశాల సరిహద్దుల్లో భిన్నమైన అవగాహన ఉంది. పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో సరిహద్దు అతిక్రమణకు సంబంధించి తరచూ వాదనలు జరుగుతుంటాయి. సరిహద్దులో శాంతి, ప్రశాంతతను నెలకొల్పేందుకు ఇప్పటికే ఉన్న యంత్రాంగాల ద్వారా ఈ వివాదాలను పరిష్కరించడం జరుగుతుంది. 

సెప్టెంబరు 2019లో, తూర్పు లడఖ్‌లోని Pangong Tso సరస్సు సమీపంలో ఇరువైపుల పెట్రోలింగ్ బృందాల మధ్య గొడవ జరిగింది. చైనా సరస్సులో ప్రధాన భాగాన్ని కలిగి ఉంది. Chushulలోని బోర్డర్ పర్సనల్ మీటింగ్ (BPM) పాయింట్ వద్ద ప్రతినిధి స్థాయి సమావేశం జరిగిన కొద్ది గంటల్లో ఈ సమస్య పరిష్కరించారు. ఆగస్టు 2017లో సరస్సు వద్ద రెండు సైన్యాల మధ్య గొడవ జరిగిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో అనేక వందల మంది సైనికులు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వడం కనిపించింది. 2017లో డోక్లాంలో 73 రోజుల స్టాండ్-ఆఫ్ తరువాత ఏర్పడిన ప్రతిష్టంభనను వుహాన్ సదస్సు తొలగించింది.