COVID-19 cases in India: దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల నిన్న 14 మంది మృతి చెందారని, వారిలో ఐదుగురు కేరళకు చెందిన వారేనని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 5,30,500కు చేరిందని వివరించింది. ప్రస్తుతం దేశంలో 14,839 మంది హోం క్వారంటైన్లు/ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.
- T Venkateshwarlu
- Published on- November 6, 2022 / 12:05 PM IST
india corona cases
