×
Ad

India Corona Cases : దేశంలో కొత్తగా 9062 కరోనా కేసులు, 36 మరణాలు

దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గత 24 గంటల్లో 36 మంది మరణించారు. కరోనా నుంచి 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,42,86,256కు చేరుకుంది.

  • Published On : August 17, 2022 / 05:49 PM IST

india corona cases

India Corona Cases : దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గత 24 గంటల్లో 36 మంది మరణించారు. కరోనా నుంచి 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,42,86,256కు చేరుకుంది.

వీటిలో 4,36,54,064 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటిరకు వైరస్ బారినపడి 5,27,134 మంది మృతి చెందారు. 1,05,058 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కరోనా కేసులు భారీగా పడిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.49 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Delhi Covid-19 Cases: ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు

దేశంలో నమోదు అయిన మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.57 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 208.57 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.