Delhi Covid-19 Cases: ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ కోరలుచాస్తోంది. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వ్యాప్తి పెరుగుదలతో పాటు ఈ వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారిసంఖ్య పెరుగుతోంది.

Delhi Covid-19 Cases: ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు

Corona virus

Delhi Covid-19 Cases: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ కోరలుచాస్తోంది. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వ్యాప్తి పెరుగుదలతో పాటు ఈ వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారిసంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో రోజుకు ఎనిమిది నుంచి 10 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందుతున్నారు. దేశ రాజధానిలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్-జి) వినయ్ కుమార్ సక్సేనా మంగళవారం మాట్లాడుతూ.. ఢిల్లీలో కోవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోందని, ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

ఢిల్లీలో గత పది రోజులుగా కొవిడ్ బాధితులు పెరుగుతున్నారు. దీంతో భారీగా పాజిటివిటీ రేటు పెరుగుతుంది. కొవిడ్ సోకిన వారితో ఆస్పత్రుల్లో పడకలు క్రమంగా నిండుతున్నాయి. అయితే ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత పది రోజులుగా ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కోవిడ్ -19 పాజిటివిటీ రేటు పెరిగిందని, తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలాఉంటే కొవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 8 నుంచి 10 వరకు మరణాలు నమోదవుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కొవిడ్ నివారణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మాస్క్ తప్పని సరి చేసిన ప్రభుత్వం.. మాస్క్ ధరించక పోతే రూ. 500 జరిమానా విధిస్తామని తెలిపింది. అధిక పాజిటివిటీ రేటు స్థిరంగా కొనసాగుతోందని, రీ ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అన్నారు. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇదిలాఉంటే ఢిల్లీలో మంగళవారం ఒక్కరోజే 917 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కొవిడ్ బారిన పడి మరణించారు.