India vs Australia: ఆలస్యంగా టాస్.. కాసేపట్లో మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంది. రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, మైదానం కాస్త పచ్చిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేస్తున్నారని బీసీసీఐ ప్రకటించింది. రాత్రి 7 గంటలకు మైదానాన్ని పరిశీలిస్తారని, అనంతరం టాస్ గురించి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.

India vs Australia: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంది. రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, మైదానం కాస్త పచ్చిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేస్తున్నారని బీసీసీఐ ప్రకటించింది. రాత్రి 7 గంటలకు మైదానాన్ని పరిశీలిస్తారని, అనంతరం టాస్ గురించి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓడిపోయింది. దీంతో నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. చివరి మ్యాచ్ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. భారత్‌ జట్టును అనేక సమస్యలు వేధిస్తుండడంతో ఈ మ్యాచ్ ను టీమిండియా గెలుస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఫీల్డింగ్ లో రాణించలేకపోవడంతో తొలి టీ20లో భారత్ చేతులారా మ్యాచ్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. భారత ఫీల్డింగ్‌, బౌలింగ్ పేలవంగా ఉండడం టీ20 ప్రపంచ కప్ లో ఎలా రాణిస్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా

ట్రెండింగ్ వార్తలు