IND vs NZ T20 Match: భారత్, కివీస్ టీ20 మ్యాచ్ రద్దు.. వర్షం కారణంగా రద్దు చేసిన అంప్లైర్లు

భారత్ - న్యూజీలాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మధ్యాహ్నం 12గంటలకు జరగాల్సిన మ్యాచ్‌ను తొలుత అంప్లైర్లు వాయిదా వేశారు.

India vs New Zealand

IND vs NZ T20 Match: భారత్ – న్యూజీలాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మధ్యాహ్నం 12గంటలకు జరగాల్సిన మ్యాచ్‌ను తొలుత అంప్లైర్లు వాయిదా వేశారు. 11:30 గంటలకు టాస్ వేయాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా వీలుకాలేదు. 11.40 సమయంలో వర్షం ఆగిపోయింది. కానీ.. కొద్దిసేపటికే మళ్లీ ప్రారంభమైంది. ఎంతకీ వర్షం తెరిపి ఇవ్వకపోవటంతో మ్యాచ్ జరిగే వీలులేక మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు ప్రకటించారు.

IND vs NZ T20 Match: నేడు కివీస్‌ వర్సెస్ టీమిండియా టీ20 మ్యాచ్.. కుర్రాళ్లకు పరీక్ష.. శుభ్‌మన్ గిల్ అరంగ్రేటం?

టీమిండియా జట్టు న్యూజీలాండ్ పర్యటనలో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. నేడు వెల్లింగ్టన్‌లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్, 22న మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతాయి.

టీ20 సిరీస్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లాంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండానే హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్లు కివీస్‌తో పోటీపడనున్నారు. సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్న భారత యువ ఆటగాళ్లు మ్యాచ్ రద్దుతో నిరాశ తప్పలేదు.