India vs New Zealand: టౌరంగా చేరుకున్న టీమిండియా.. ఫొటోలు పోస్ట్ చేసిన బీసీసీఐ

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇవాళ తెల్లవారుజామున టౌరంగా చేరుకుంది. అక్కడి బే ఓవల్ మైదానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య నిన్న వెల్లింగ్టన్‌లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ జరిగే వీలులేకపోవడంతో ఈ టీ20ని రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు తెలిపారు.

India vs New Zealand

India vs New Zealand: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇవాళ తెల్లవారుజామున టౌరంగా చేరుకుంది. అక్కడి బే ఓవల్ మైదానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య నిన్న వెల్లింగ్టన్‌లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ జరిగే వీలులేకపోవడంతో ఈ టీ20ని రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు తెలిపారు.

దీంతో టీమిండియా 2వ టీ20 కోసం టౌరంగా చేరుకుంది. టీమిండియాతో పాటు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఆయన తాత్కాలికంగా చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ నుంచి భారత్ నిష్క్రమించాక రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందానికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఆ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత సిరీస్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ ఆడడం లేదు. దీంతో టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యాను వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ ను సారథిగా బీసీసీఐ నియమించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..