Man Wins 22 Year Battle : రూ.20 కోసం 22 ఏళ్లు న్యాయపోరాటం..ఎట్టకేలకు ఫలించింది

భారతీయ రైల్వే నుంచి రూ.20 కోసం ఓ లాయర్‌ చేసిన 22 ఏళ్ల న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికి 12% వడ్డీతో పాటు రూ.20 రీఫండ్‌ ఇవ్వాలని, అదేవిధంగా రూ.15 వేల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోర్టు తాజాగా ఆదేశించింది.

indian man wins 22 year battle : భారతీయ రైల్వే నుంచి రూ.20 కోసం ఓ లాయర్‌ చేసిన 22 ఏళ్ల న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికి 12% వడ్డీతో పాటు రూ.20 రీఫండ్‌ ఇవ్వాలని, అదేవిధంగా రూ.15 వేల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోర్టు తాజాగా ఆదేశించింది. న్యాయం కోసం తాను పడిన తపన చివరకు ఫలించిందని ఉత్తరప్రదేశ్‌కు చెందిన తుంగనాథ్‌ చతుర్వేది ఆనందం వ్యక్తం చేశారు.

1999లో తుంగనాథ్‌ చతుర్వేది మథుర నుంచి మొరాదబాద్‌కు రెండు టిక్కెట్లు కొన్నారు. అయితే అధికారులు అందుకు రూ.70 బదులు రూ.90 చార్జ్‌ చేశారు. రశీదు కూడా ఇచ్చారు. అధికంగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఎన్నిసార్లు అభ్యర్థించినా.. రైల్వే అధికారులు తిరస్కరించారు. దీనిపై తుంగనాథ్‌ మథురలోని వినియోగదారుల హక్కుల కోర్టును ఆశ్రయించాడు.

Reliance-Future Retail Deal : రిలయన్స్ తో న్యాయపోరాటంలో అమెజాన్ విజయం

రెండు దశాబ్దాలపై పైగా జరిగిన ఈ న్యాయ పోరాటంలో ఐదుగురు జడ్జిలు..120 సార్లు కేసు విచారణ చేపట్టారు. ఫీజులు, ఇతర చెల్లింపుల కోసం తుంగనాథ్‌ రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. అయితే తాను చేసిన న్యాయ పోరాటం డబ్బు కోసం కాదని, తన హక్కుల కోసమని తుంగనాథ్‌ చతుర్వేది అంటున్నారు. రూ.20 కోసం తుంగనాథ్‌ చేసిన న్యాయ పోరాటం ఆసక్తికరమైంది.

ట్రెండింగ్ వార్తలు