Indian Inspiring Womens
Indian Inspiring Womens: మన దేశంలో ఇంటర్ నెట్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టీనేజ్ పిల్లల నుండి.. ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు నిద్రలేచింది మొదలు ఇంటర్నెట్ ఓపెన్ చేయకపోతే రోజు గడవదు. మంచి, చెడు, వంట, వాస్తు, బ్యూటీ, ఫిట్ నెస్, ఎడ్యుకేషన్, టైం పాస్ ఇలా ఏది కావాలన్నా ఒక్క క్లిక్. మన ముందు తెర మీద ప్రత్యక్షం చేసే ఇంటర్ నెట్ ఇప్పుడు మనిషి మనుగడలో కీలక భాగమైపోయింది. కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ తో సోషల్ మీడియా, ఓటీటీలకు ఫుల్ గిరాకీ పెరిగిపోయింది. సోషల్ మీడియా దెబ్బకు రాత్రికి రాత్రి సెలబ్రిటీలైపోయిన వారితో పాటు అదే సోషల్ మీడియా వేదికగా సమాజాన్ని అంత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారిలో మన దేశానికి చెందిన కొందరు గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం..
1. Ayesha Billimoria
https://www.instagram.com/fitgirl.india/?utm_source=ig_embed
ఆయేషా బిల్లిమోరియా ముంబయికి చెందిన ట్రాక్ అథ్లెట్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ ట్రైనర్, మూడుసార్లు 200 మీటర్ల జాతీయ ఛాంపియన్, ఒలింపిక్ ఆశావాది, మోడల్, టెడ్ఎక్స్ స్పీకర్ మరియు రచయిత. 2000లో బైక్ ప్రమాదంలో గాయపడిన అయేషాకు పాక్షిక పక్షవాతం సోకింది. కానీ, నిరాశపడిన ఆమె ఫిట్నెస్ మీద శ్రద్ధపెట్టి నేడు ఛాంపియన్ స్థాయికి ఎదిగారు. ఛాంపియన్ మాత్రమే కాదు.. రచయితగా, స్పీకర్ గా స్పోర్ట్స్, ఫిట్ నెస్ లో రాణించాలనుకొనే ఎందరినో ఆమె ఇంటర్నెట్ ద్వారా ఇన్ ఫ్లూఎన్స్ చేస్తున్నారు.
2. Karuna Nundy
https://www.instagram.com/p/CMu8-Ubp7yg/?utm_source=ig_embed
సుప్రీంకోర్టు న్యాయవాదైన కరుణ నంది మానవ హక్కుల కోసం పోరాటంలో ముందుంటారు. 2012లో ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపిన ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేసుతో వెలుగులోకి వచ్చిన ఆమె ఈ కేసులో అలుపెరగని పోరాటం చేసి మన దేశంలో అత్యాచార నిరోధక బిల్లు తెచ్చేందుకు కృషి చేశారు. అంతేకాదు భోపాల్ గ్యాస్ బాధితుల తరపున కూడా సుప్రీమ్ కోర్టులో ఆమె పోరాటం అనిర్వచనీయం. ఆమె నిత్యం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చట్టాలు, మానవ హక్కులపై అవగాహన కల్పిస్తూ ప్రజల పక్షాన నిలబడుతుంటారు. అందుకే ఆమె సోషల్ మీడియాలో మోస్ట్ ఇన్ ఫ్లూఎన్సర్ గా మారారు.
3. Deepica Mutiyala
https://www.instagram.com/p/CNKo3sqjGpe/?utm_source=ig_embed
దీపికా ముటియాలా యూ ట్యూబ్ లో ఫెమస్ పర్సనాలిటీ. 2015లో ఆమె చేసిన ఒక వీడియో ఆమెను సెలబ్రిటీగా మార్చేసింది. కళ్ళ కింద నల్లటి వలయాలను రెడ్ లిప్ స్టిక్ తో ఎలా కవర్ చేసుకోవాలి అంటూ ఆమె చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఇప్పటికి ఈ వీడియోను పది మిలియన్లకు పైగా వీక్షించగా దీపిక ప్రస్తుతం వ్యాపారవేత్త, బ్యూటీ అండ్ కల్చర్ గురించి వివరించే లైవ్ టింటెడ్ వ్యవస్థాపకురాలు మరియు సీఈఓగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో దీపికా ఫాలోయింగ్, ఆమె చెప్పే వివరణకు విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు.
4. Masaba Gupta
https://www.instagram.com/p/CM4rRRPhkBQ/?utm_source=ig_embed
కరోనా లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ ‘మసబా మసబా’తో వెలుగులోకి వచ్చిన మసాబా అంతకు ముందేThey are the most influential women బాలీవుడ్ లో టాప్ ఫ్యాషన్ డిజైనర్. ఆమెతో పాటు ఆమె తల్లి నీనా గుప్తా జీవితాలకు కల్పిత కథThey are the most influential womenను జోడించి తెరకెకెక్కించిన వెబ్ సిరీస్ లో మసాబా గ్రేట్ డిజైనర్ గా ఎలా ఎదిగారో చూపించగా రియల్ లైఫ్ రియాలిటీ షో కాదు అంటూ ఆమె సోషల్ మీడియాలో నెటిజన్లను ప్రభావితం చేశారు.
5. Faye Dsouza
https://www.instagram.com/p/CNN1V1il0LR/?utm_source=ig_embed
డిసౌజా అందరిలాంటి రెగ్యులర్ న్యూస్ యాంకర్ కాదు. ఆమె న్యూస్‌రూమ్ నుండి బయటికి వెళ్లి ఇంటర్నెట్ ద్వారా ప్రజలతో మమేకమవుతారు. ప్రజల నుండి రియల్ టైమ్ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ జర్నలిస్టుల పని, మీడియా నీతి, నిజాయతీలతో న్యూస్‌రూమ్‌ను కలుపుతూ ముందుకెళ్తారు. డిసౌజా అంటే కేవలం నెటిజన్లు, ప్రజలే కాదు మిగతా జర్నలిస్టులు, యాంక్టర్లను కూడా ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా ఎదిగారు.
6. Rhea Kapoor
https://www.instagram.com/p/CH2sxV3p5cN/?utm_source=ig_embed
మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీగా పేరున్న బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఓ మహిళా నిర్మాత పనిచేస్తే ఎలా ఉంటుందో చూపించిన సూపర్ విమెన్ రియా కపూర్. నిర్మాతగానే కాకుండా లక్ష్యాలను సాధించడంతో ఒక స్టైలిస్ట్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న రియా.. Veere De Wedding సినిమా కోసం ఇంటర్నెట్ ద్వారా ఇండియన్-అమెరికన్ పాటల రచయిత, గాయని లిసా మిశ్రాను ఇంటర్నెట్‌లో గుర్తించి ఆమెతో రిప్రైజ్ వెర్షన్ పాటను పాడించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
7. Prajakta Kohli
https://www.instagram.com/mostlysane/?utm_source=ig_embed
యూట్యూబ్ లో కామెడీ వీడియోలను రూపొందించడంతో కెరీర్ మొదలుపెట్టిన ప్రజక్త కోలి, ఇప్పుడు పలు OTT ప్లాట్‌ఫామ్‌లలో నటిగా రాణిస్తున్నారు. “మోస్ట్లీసేన్” యూట్యూబ్ ఛానెల్ పేరు ద్వారా ప్రసిద్ది చెందగా ఆమె రోజువారీ జీవిత పరిస్థితుల ఆధారంగానే కామెడీ వీడియోస్ రూపొందించడంతో బాగా పాపులర్ అయ్యారు.
8. Komal Panday
https://www.instagram.com/komalpandeyofficial/?utm_source=ig_embed
సోషల్ మీడియాలో కోమల్ కు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లుండగా, డ్రెస్సింగ్, ఫ్యాషన్‌పై చిట్కాలు ఇవ్వడంలో ఆమెకు ఆమె సాటిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరికి ఎలాంటి వెస్ట్రన్ డ్రెస్సింగ్ సెట్ అవుతుందని క్రియేటివిటీని జోడించి చెప్పడంలో ఆమె సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.
9. Shereen Sikka
https://www.instagram.com/shereenlovebug/?utm_source=ig_embed
ఫ్యాషన్ గురించి బ్లాగింగ్ ప్రారంభించిన మొదటి కొద్ది మందిలో షెరీన్ ఒకరు కాగా.. ఆమె తన బ్లాగ్ లో ఫ్యాషన్ తో పాటు లవ్ గురించి కూడా లెక్చర్లు ఇస్తుంటారు. షెరీన్ వెస్ట్రన్ దుస్తులతో పాటు చీరలు వంటి సాంప్రదాయ దుస్తులపై వాటిపై చేసే కంటెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
10. Anoushka Mehta
https://www.instagram.com/themodernmowgli19/?utm_source=ig_embed
అనౌష్కా మెహతా జంతు ప్రేమికురాలిగా రాణిస్తూ ది మోడరన్ మోగ్లీ అనే సంస్థను స్థాపించి మూగజీవాలను రక్షిస్తుంది. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో ఆమె స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి కుక్కలు, పిల్లులు వంటి ప్రాణులను దత్తత తీసుకొని చూసుకుంటుంది. 24 ఏళ్ల అనౌష్క ప్రతిరోజూ 190 కుక్కలకు ఆహారం ఇస్తూ మనదేశంతో పాటు యుఎస్, కెనడాలో నుండి కూడా గాయపడిన జంతువులను ఆమె రక్షించి కాపాడుతుంది.
11. Shehnaz Tresurywala
https://www.instagram.com/shenaztreasury/?utm_source=ig_embed
ఒకప్పుడు నటి అయిన షెహ్నాజ్ ఇప్పుడు ట్రావెల్, రొమాన్స్, స్మైల్స్ అనే కాసెప్ట్ మీద జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే కాన్సెప్ట్ తో వీడియోలను రూపొందిస్తూ ఆమె జీవిత పాఠాలను నెటిజన్లతో పంచుకుంటూ వారిని ప్రేరేపించడమే ఉద్దేశ్యంతో ఆమె సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.