Mermaid Plant
Mermaid Plant: ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ కొత్త మొక్కలు జలకన్యగా నామకరణం చేశారు. అండమాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో భారతీయ శాస్త్రవేత్తలు ఓ కొత్త వృక్ష జాతి మొక్కను కనుగొన్నారు. రెండేళ్ల క్రితం మొక్కల పరిశోధనలో భాగంగా 2019లో అండమాన్ దీవులకు వెళ్లిన మన వృక్ష శాస్త్రవేత్తలకు ఓ కొత్త మొక్క దర్శనమిచ్చింది. అయితే.. ఆ మొక్క పాతదా లేక కొత్త జాతికి చెందినదా అని తెలుసుకొనేందుకు వాళ్లకు రెండేళ్ల సమయం పట్టింది.
కొత్తగా కనుగొన్న మొక్కపై DNA సీక్వెన్సింగ్ చేసి ఇప్పటికే ఉన్న వృక్షజాలంతో పోల్చి చూసి ఇది కొత్త జాతిగా గుర్తించారు. మొత్తానికి కొత్తగా కనుగొన్న మెరైన్ గ్రీన్ ఆల్గేకు చెందిన ఆ మొక్కకు జలకన్య (Mermaid) అని పేరు పెట్టారు. కాగా, అండమాన్ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని కనుగొనడం గత నాలుగు దశాబ్ధాల్లో ఇదే మొదటిసారి. పంజాబ్ సెంట్రల్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆ మొక్కకు అసిటబులేరియా జలకన్యకే అన్న శాస్త్రీయ నామాన్ని పెట్టారు.
జలకన్య అంటే సముద్ర దేవతని అందరికీ తెలిసిందే కాగా.. కొత్తగా ఇప్పుడు గుర్తించిన ఈ మొక్క చాలా అద్భుతంగా ఉందని, చాలా సున్నితమైన డిజైన్‌లో ఆ మొక్క ఉండగా.. ఛత్రీల తరహాలో ఆ జలకన్య కనిపిస్తున్నట్లు మొన్నను కనుగొన్న బృందంలో ఒకరైన డాక్టర్ ఫెక్లీ బస్త్ తెలిపారు. జలకన్య మొక్క ఒకేఒక్క భారీ కణంతో తయారైనట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.