COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం రోజు దేశవ్యాప్తంగా 1,675 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు 2,022 కేసులు నమోదయ్యాయి.

COVID Cases In India: దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం రోజు దేశవ్యాప్తంగా 1,675 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు 2,022 కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదు రోజులు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, సోమవారం మాత్రం ఈ సంఖ్య తగ్గింది. ఇక, గడిచిన వారంలో మొత్తంగా 14,700 కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.03గా ఉంది. ఢిల్లీలో 268, మహారాష్ట్రలో 208, తెలంగాణలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 31 మంది కరోనాతో మరణించగా, ఇప్పటివరకు దేశంలో కరోనాతో మృతి చెందిన వాళ్ల సంఖ్య 5,24,490గా ఉంది.

CM Sacks Health Minister: అవినీతి ఆరోపణలు.. మంత్రిని తొలగించిన పంజాబ్ సీఎం

అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మన దేశంలో కరోనాతో 47.4 లక్షల మంది మరణించారు. దీనిపై సోమవారం కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 192.52 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. 57,000 అదనపు డోసులు కూడా పూర్తయ్యాయి. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్టర్ డోసుల కార్యక్రమం ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్ల సంఖ్య 16.30 కోట్లుగా ఉన్నట్లు అంచనా.

ట్రెండింగ్ వార్తలు