భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్టేషన్..అచ్చు ఎయిర్ పోర్టులా ఉంది..!!

Indias First AC Railway Terminal: ఇండియాలో రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయో తెలిసిందే. కొన్ని స్టేషన్లలో అయితే ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కానీ కర్ణాటకలోని బెంగళూరులో అచ్చంగా ఎయిర్ పోర్టులాంటి రైల్వేస్టేషన్ ను నిర్మించింది రైల్వే శాఖ. ఇది భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్టేషన్.. కావటం విశేషం. దేశంలోనే తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖామంత్రి పీయుష్ గోయర్ రైల్వే శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బయ్యప్పణహళ్లిలో ఈ ఏసీ రైల్వే స్టేషన్ ను నిర్మించారు.

అచ్చు ఎయిర్‌ పోర్ట్‌ను తలపించే రైల్వే స్టేషన్‌కు మన భారత జాతి గర్వించే ఇంజనీర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు..భారతరత్న బిరుదాంకితుడు ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య’ పేరును పెట్టారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ రైల్వే స్టేషన్ ప్రయాణీకులకు సేవలందించేందుకు సిద్ధంకానుంది. ఈ ఏసీ రైల్వే స్టేషన్ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

బెంగళూరులో ఉన్న రెండు రైల్వే స్టేషన్లలో ప్రయాణీకల రద్దీని తగ్గించేందుకు కొత్తగా నిర్మించిన ఈ ఏసీ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం రూ.314 కోట్లు ఖర్చు పెట్టారు. రైల్వే స్టేషన్‌లో మొత్తం ఏసీ ఉంటుంది. ఇక సదుపాయాలు కూడా ఎయిర్ పోర్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఈ ఏసీ రైల్వే స్టేషన్‌లో ఎన్నో అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. దేశంలోనే తొలి సెంట్రలైజ్‌డ్‌ ఏసీ రైల్వే టెర్మినల్‌గా పేరొందింది. ఈ టెర్మినల్‌లో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, రియల్ టైమ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫుడ్ కోర్టు, 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్‌ మొదలైన వాటిని ఏర్పాటు చేశారు.

ఈ రైల్వే స్టేషన్‌ను రూ.314 కోట్ల వ్యయంతో 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ టెర్మినల్‌లో 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, 5 బస్సులను నిలిపే వీలుగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఈ నెల చివరినాటికి ఈ టర్మినల్ అందుబాటులోకి రానుంది.

Catch glimpses of upcoming Sir.M.Visvesvaraya Bengaluru Terminal.

It will be equipped with modern facilities. pic.twitter.com/w9tZ9gvYMf
— Ministry of Railways (@RailMinIndia) February 20, 2021