#RIPTwitter – Koo : ట్విట్టర్ పనైపోయింది.. మా కంపెనీలో చేరండి.. మస్క్ తొలగించిన ట్విట్టర్ ఉద్యోగులకు Koo ఆఫర్..!

#RIPTwitter - Koo : ట్విట్టర్ పరిస్థితిని గమనించిన Twitter భారతీయ ప్రత్యర్థి (Koo) ప్లాట్ ఫారమ్ రంగంలోకి దిగింది. Twitter నుంచి తొలగించిన ఉద్యోగులను తమ కంపెనీలో చేరాల్సిందిగా Koo కోరుతోంది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను Koo కంపెనీలో చేరేలా ప్రేరేపిస్తోంది. అందుకు Koo కొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది.

#RIPTwitter – Koo : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గం ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను రోడ్డుపడేశాడు. రాజీనామా చేయకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తానంటూ ట్విట్టర్ ఉద్యోగులను హెచ్చరించాడు. దాంతో ట్విట్టర్ ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయించాడు. అంతటితో ఆగలేదు.. మస్క్ అల్టిమేటం జారీ చేశాడు.. దాంతో వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన కొన్ని వారాల తర్వాత ఉద్యోగులందరిని తొలగించడంతో గందరగోళ పరిస్థితి మారింది.

ట్విట్టర్ ఉద్యోగులంతా మస్క్ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక్కొక్కరుగా ట్విట్టర్ కంపెనీ నుంచి రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు. మస్క్ మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా ఉద్యోగులు ఎవరూ కూడా హాజరుకాలేదు. ట్విట్టర్ ఉద్యోగులంతా వరుస రాజీనామాలు చేయడంతో ట్విట్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ట్విట్టర్ షట్‌డౌన్ అయ్యే పరిస్థితి ఉండొచ్చునని భావిస్తున్నారు. ట్విట్టర్ పరిస్థితిని గమనించిన Twitter భారతీయ ప్రత్యర్థి (Koo) ప్లాట్ ఫారమ్ రంగంలోకి దిగింది.

India’s Twitter rival Koo wants to hire ex-Twitter employees fired by Elon Musk

Twitter నుంచి తొలగించిన ఉద్యోగులను తమ కంపెనీలో చేరాల్సిందిగా Koo కోరుతోంది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను Koo కంపెనీలో చేరేలా ప్రేరేపిస్తోంది. అందుకు Koo కొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది. కూ (Koo) సహ వ్యవస్థాపకుడు, మయాంక్ బిదవత్కా మాట్లాడుతూ.. ట్విట్టర్ వదిలిన మాజీ ఉద్యోగులంతా మన కంపెనీలో చేరుతారని భావిస్తున్నాం.. మస్క్ తొలగించిన ట్విట్టర్ ఉద్యోగులను తమ కంపెనీలో చేరాల్సిందిగా కోరుతూ బిడవత్కా ట్విట్టర్ వేదికపై #RIPTwitter అనే హ్యాష్ ట్యాగ్ పోస్టు చేశారు.

ట్విట్టర్ ఉద్యోగులను మస్క్ తొలగించడం చాలా బాధాగా ఉందన్నారు. అందుకే Twitter మాజీ ఉద్యోగులలో కొందరిని తమ కంపెనీల్లో చేరాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగుల ప్రతిభకు విలువనిచ్చే చోట పనిచేసేందుకు మీరంతా అర్హులు అంటూ ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మందిని తమ కంపెనీలో చేర్చుకుంటామని హామీ ఇచ్చారు. మైక్రోబ్లాగింగ్ ఉద్యోగుల శక్తికి సంబంధించినది మాత్రమే.. అంతేకానీ, ఉద్యోగులపై అణచివేత కాదని ట్వీట్‌లో పేర్కొన్నాడు. స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ (Koo) ప్రపంచవ్యాప్తంగా రెడీగా ఉంది. ఈ వారం ప్రారంభంలో.. కూ (Koo) సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాధాకృష్ణ కూడా Koo త్వరలో యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులోకి వస్తుందని ధృవీకరించారు.

India’s Twitter rival Koo wants to hire ex-Twitter employees fired by Elon Musk

‘అందరూ నమ్మండి.. ఇది మన క్షణం.. రాక్ చేద్దాం. అమెరికాలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ Koo గురించి తెలియజేయండి’ అని రాధాకృష్ణ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా అనేక ఇతర దేశాలలో కూడా ట్విట్టర్ ప్రత్యర్థి కూ (Koo) రానుందని ఇంటర్వ్యూలో ధృవీకరించారు. Koo కంపెనీ 2020 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ 50 మిలియన్ యాప్ డౌన్‌లోడ్‌లను దాటినట్లు ధృవీకరించింది. ట్విట్టర్ ఇండియాలో ప్రస్తుతం హిందీ, కన్నడ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు, గుజరాతీతో సహా 10 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపు గందరగోళానికి దారితీసింది. ఇప్పుడే అదే పరిస్థితిని కూ (Koo) పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. అత్యుత్తమ ట్విట్టర్ ప్రత్యామ్నాయంగా Koo మాత్రమేనంటూ ప్రచారం చేస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter At Risk : ఉద్యోగుల రాజీనామాలతో డేంజర్‌లో ట్విట్టర్.. ఏ క్షణమైన షట్‌డౌన్ కావొచ్చు.. యూజర్లు అకౌంట్ డేటాను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు