Sweat
Sweating : మనిషికి చెమట పడితే మంచిదా… చెమట పట్టకుంటే మంచిదా… అనే విషయంపై భిన్న వాదనలు ఉన్నాయి. మామూలుగా అధికంగా చెమట పడితే ఆరోగ్యంగా ఉన్నట్లేనని బావిస్తుంటారు. అదే తరుణంలో అధికంగా చెమట పట్టటం అనేది అనారోగ్యానికి కారణమని కొందరు అపోహపడుతుంటారు. చెమట విషయంలో నిపుణులు అసలేం చెబుతున్నారు. ఆవివరాలేంటో తెలుసుకుందాం…
ఆరోగ్యానికి చెమట మేలు కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్ళిపోవాలంటే చెమట అనేది చర్మం నుండి బయటకు వెళ్ళాలని వైద్యులు చెబుతున్నారు. చమట బయటకు వెళ్ళం వల్ల మొఖం మీద మొటిమలు వంటివి రావు. ప్రస్తుతం అధునిక యుగంలో మనిషి జీవితం యాత్రీకరణగా మారిపోయింది. ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, అత్యాధునిక వాహనాలు రాకతో ప్రజల శారీరక శ్రమకు దూరమయ్యారు. దీంతో చాలామంది కొద్దిపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. కొద్దిగా చెమట వచ్చినా సహించలేకపోతున్నారు.
అయితే శరీరానికి చెమట పట్టటమనే చాలా ముఖ్యమైనది. వ్యాయామం చేసేసమయంలో చెమట పట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అటువంటి పరిస్థితిలో చెమట మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. చెమట మీ శరీరం నుంచి మలినాలను బయటకు నెట్టివేస్తుంది.
చెమటలో ఉప్పు, చక్కెర కాకుండా, కొలెస్ట్రాల్, ఆల్కహాల్ వంటి పదార్థాలు కూడా ఉన్నాయని పలు పరిశోదనల్లో తేలింది. అవయవాలు మెరుగ్గా పనిచేయటంతోపాటు, శరీరం నుండి మలినాలు బయటకు వెళ్ళాలంటే చెమట పట్టాల్సిందే. చెమట బయటకు వచ్చినప్పుడు, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
వ్యాయామం బాగా చేసిన సందర్భలో చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా చెమట ద్వారా బయటకు వస్తాయి. ఇలా చెమట పట్టట వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజు చెమట పట్టేవారిలో పట్టటం వల్ల వ్యాధులు దరిచేరే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుందట. చర్మ నుండి చెమట బయటకు రావటం వల్ల దీని వల్ల పలు రకాల అలర్జీ, బ్యాక్టీరియా సమస్యలను దూరం చేస్తాయి.