Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డిని కోల్పోవడం దురదృష్టకరం.. బాలకృష్ణ, మోహన్ బాబు సంతాపం

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. దుబాయ్ ఎక్స్ పో నుంచి అదైవరం హైదరాబాద్ చేరుకున్న మంత్రి.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు.

Mekapati Goutham Reddy

Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. దుబాయ్ ఎక్స్ పో నుంచి అదైవరం హైదరాబాద్ చేరుకున్న మంత్రి.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే లోపే పరిస్థితి చేజారి.. గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి జగన్ సహా.. మంత్రులు, పార్టీలకు అతీతంగా నేతలు.. సినీ సెలబ్రిటీలు మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Mekapati Goutham Reddy: నెల్లూరులోనే మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి అంత్యక్రియలు

నటుడు మంచు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా మంత్రి మేకపాటి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్‌ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని మంచు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపారు.

Mekapati Goutham Reddy Live update: ఏపీ మంత్రి మేకపాటి కన్నుమూత.. లైవ్ అప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించి పార్టీలకు అతీతంగా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ మంచి యువనాయకుడిగా
పేరుతెచ్చుకున్నారు. ఇలాంటి నవతరం నాయకుల్ని చిన్నవయస్సులోనే కోల్పోవడం దురదృష్టకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.