Minister Mallareddy
IT Raids: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి ఐటీ బృందాలు మంత్రి కొడుకు, అల్లుడు నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. తెల్లవారు జామున ఆయన నివాసంకు వెళ్లిన ఐటీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి.
ED, IT Raids on TRS MP Gayathri ravi Office : టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ,ఐటీ దాడులు
మరోవైపు మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డితోపాటు, మంత్రి సోదరుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సుమారు 50బృందాలుగా విడిపోయిన అధికారులు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి నివాసం చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలతో పహారాను ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే దూలపల్లిలోని మల్లారెడ్డి కళాశాలల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అక్కడ నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.