Rain in Telangana: చల్లని కబురు.. రానున్న మూడ్రోజులలో వర్షాలు!

వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

It Will Rain For The Next Three Days In Telangana

Rain in Telangana: వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 1.5-2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరిత ద్రోణి ఆవరించి ఉండగా.. పశ్చిమ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందస్థాయి గాలులు విస్తున్నాయి. వీటి ప్రభావంతో వచ్చే మూడురోజుల్లో రాష్ట్రంలో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపిన అధికారులు ఒకట్రెండు చోట్ల మోస్తరు జల్లులు కూడా కురవచ్చని చెప్పారు. కాగా, నైరుతి రుతుపవనాలు ఈ సారి ముందే పలకరిస్తున్నాయి. గత వారమే దక్షిణ అండమాన్‌ సముద్రంతో పాటు.. దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో పలు ప్రాంతాల్లో ప్రవేశించిన రుతుపవనాలు ఒకరోజు ముందే కేరళ తీరాన్ని తాకనున్నాయి.

బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు వస్తుండగా ఈనెల 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాల రాకతో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ నిపుణులు చెప్పారు. కాగా.. జూన్‌ 10 లోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.