Neeraj Chopra (1)
Neeraj Chopra: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన ప్లేయర్స్ కు ప్రశంసలతో పాటు నగదు నజరానా కొనసాగుతూనే ఉంది. అథ్లెటిక్స్ లో శతాబ్దం తర్వాత పతకం తెచ్చిన నీరజ్ కు అయితే.. ఇటు ప్రశంసలు, అటు భారీ నజరానాల వరద కొనసాగుతూనే ఉంది. ఇక అతని బిజినెస్ మార్కెట్ అయితే ఏకంగా వెయ్యి రేట్లు పెరిగి అతని బల్లెం మాదిరే దూసుకుపోతుంది.
చోప్రాకు ఇప్పటికే సొంత రాష్ట్రం హరియాణా రూ.6 కోట్ల నగదు బహుమతి ప్రకటించగా పొరుగు రాష్ట్రాలు పంజాబ్ రూ.2, మణిపూర్ కోటి రూపాయలు ప్రకటించాయి. ఇక కేంద్రం పాలసీ ప్రకారం రూ.75 లక్షలు అందనుండగా బైజూస్ సంస్థ రూ.2 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ సంస్థ మరో కోటి అందించనున్నారు. ఇప్పటికే నీరజ్ మొత్తం 13 కోట్ల నగదు బహుమతి పొందగా ఇండిగో సంస్థ ఏడాది పాటు ఉచిత విమాన ప్రయాణం, ఆనంద మహీంద్రా XUV 700 మోడల్ కారు బహుమతులుగా అందాయి.
ఇక, నీరజ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకొనేందుకు గాను పలు కంపెనీలు భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నాయి. గతంలో నీరజ్ ఏడాదికి పది నుండి ఇరవై కోట్ల పారితోషకం తీసుకుంటే.. ఇప్పుడు తమ ఉత్పత్తులకు ప్రచారం చేస్తే ఏకంగా ఏడాదికి రెండు నుండి మూడు కోట్ల వరకు చెల్లిస్తామని కంపెనీలు క్యూ కడుతున్నాయి. అంటే, ఇది వెయ్యికి రేట్లుకి పైగా పెరిగినట్లే లెక్క.