Jabardasth Comedian Punch Prasad Suffering Critical Condition
Punch Prasad: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాలను అందిస్తోంది. ఈ స్టేజీపై నవ్వులు పూయించిన వారు ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలోనే కొనసాగుతూ వస్తున్నారు. అయితే ప్రేక్షకులను నవ్వించే వారి జీవితంలో ఎంత విషాదం ఉంటుందో మనకు కొన్నిసార్లు స్టేజీపైనే చూపెట్టారు.
Jabardasth : నువ్వంటే నిజంగానే ఇష్టం ఇమ్ము.. మీ అమ్మకి చెప్పు.. ఓపెన్ అయిన వర్ష..
కానీ, కొందరు మాత్రం తమ బాధలను దిగమింగి, ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో గతకొంత కాలంగా పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఇటీవల ఆయన జబర్దస్త్ కామెడీ షోలో ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో అసలు ఆయనకు ఏం అయ్యిందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, దీనికి సంబంధించి మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు ఆసియాతో కలిసి పంచ్ ప్రసాద్ పరిస్థితిని వీడియో రూపంలో ప్రేక్షకులు చూపెట్టారు.
Jabardasth Rakesh : జబర్దస్త్ రాకేష్ తమ్ముడి కూతురి పుట్టినరోజు వేడుకలు..
ప్రస్తుతం పంచ్ ప్రసాద్ నడవలేని స్థితిలో ఉండటం చూసి అభిమానులు, ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. ఆయన నడుముకు బ్యాక్ సపోర్ట్ బెల్టు వేసుకుని, తన భార్య సపోర్ట్‌తో మాత్రమే నిలబడుతున్నాడు. ఇక చేతిలో స్టాండ్ పట్టుకుని కదలాలని ఎంత ప్రయత్నించినా ప్రసాద్ నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నాడని, డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారని పంచ్ ప్రసాద్ భార్య ఏడుస్తూ తెలిపింది. అయితే ఇదంతా ప్రేక్షకులకు తెలియజేయడం తనకు ఇష్టం లేదని ప్రసాద్ కోరాడు. ఏదేమైనా బుల్లితెరపై నవ్వులు పూయించి, తనదైన పంచులతో పంచ్ ప్రసాద్‌గా పేరుతెచ్చుకున్న ఆయన్ను, ప్రస్తుతం ఇలా చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు కోరుతున్నారు.