Telangana students Sit-Ups : ఒక జడ వేసుకుని స్కూల్ కొచ్చారని విద్యార్ధినిలతో 200 గుంజీలు తీయించిన పీఈటీ..ఆస్పత్రిపాలైన బాలికలు

జడ్చర్ల మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు జడలు వేసుకుని రాకుండా ఒక జడే వేసుకుని స్కూల్ కు వచ్చిన విద్యార్థినులతో ఒక్కొక్కరు 200ల గుంజీళ్లు తీయించింది పీఈటీ. దీంతో గుంజీళ్లు తీసినవారంతా అస్వస్థతకు గురి అయి సృహ తప్పి పడిపోయారు.వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Telangana girl students sick After 200 sit Ups : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీ చేసిన నిర్వాకానికి విద్యార్ధినిలు ఆస్పత్రిపాలయ్యారు. రెండు జడలు వేసుకుని రాకుండా ఒక జడే వేసుకుని స్కూల్ కు వచ్చిన విద్యార్థినులపై అంతెత్తున ఎగిరిపడ్డాడు పీఈటీ. రెండు జడలు వేసుకోకుండా ఒక జడే ఎందుకు వేసుకొచ్చారు అంటూ 50మంది విద్యార్ధిలు ఒక్కొక్కరు 200ల గుంజీళ్లు తీయాలి అంటూ పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థినులు గుంజీళ్లు తీసినవారంతా అస్వస్థతకు గురి అయి సృహ తప్పి పడిపోయారు.

కంటిన్యూగా గుంజీల తీయటంతో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాళ్లకు వాపులు వచ్చి నడవలేకపోయారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సిబ్బందిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను సిటీలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నొప్పులతో అల్లాడిపోయిన విద్యార్థులు కొంతమంది నడవలేని స్థితిలో ఉండగా మరికొందరు జ్వరం బారినపడ్డారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన 25 మందిని బాదేపల్లి ఆసుపత్రికి తరలించారు.

కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పీఈటీ శ్వేత తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. స్కూల్లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుని సెలవులో ఉన్న ప్రిన్సిపల్ కల్పన స్కూల్ కు వచ్చారు. కానీ పీఈటీ శ్వేతను ఏమీ అనలేదు సరికదా..ఇది పెద్ద విషయం కాదని..దీని కోసం ఎందుకంత రాద్ధాతం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో పీఈటీని విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు