vizag steel plant: మోదీని జగన్ కలిసి ఒత్తిడి పెంచాలి: ‘సీపీఐ’ రామకృష్ణ

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీకరణ ప్ర‌య‌త్నాల‌కు వ్యతిరేకంగా నేడు మహా ప్రదర్శన పేరిట ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర‌స‌న స‌భ నిర్వ‌హిస్తోంది.

vizag steel plant: విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీకరణ ప్ర‌య‌త్నాల‌కు వ్యతిరేకంగా నేడు మహా ప్రదర్శన పేరిట ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర‌స‌న స‌భ నిర్వ‌హిస్తోంది. కూర్మన్నపాలెంలోని స్టీల్ ప్లాంట్‌ ఆర్చి వద్ద చేప‌ట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 500వ రోజుకు చేరుకున్న నేప‌థ్యంలో ఈ మ‌హా ప్ర‌ద‌ర్శన నిర్వ‌హిస్తోంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… 500వ‌ రోజుకు చేరిన విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి జేజేల‌ని అన్నారు.

Maharashtra: బీజేపీ నేత‌ల‌తో ఏక్‌నాథ్ షిండే భేటీ.. ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చ‌లు

ఇప్పటికైనా ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాన్ని విరమించుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఒత్తిడి పెంచాలని ఆయ‌న అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావంగా నేడు ఉదయం 11 గంటలకు విజయవాడ, దాసరి భవన్ నుండి సంఘీభావ ర్యాలీ నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు