ఆమె ప్రపంచ ఛాంపియన్.. ఇప్పుడు కొవిడ్-19 పోరాటంలో వైద్యురాలు!

  • Publish Date - May 18, 2020 / 09:44 AM IST

ఆస్ట్రేలియా క్రీడల్లో Jana Pittman అనే పేరు కొత్తేమి కాదు. ఆ అథ్లెట్.. ప్రపంచ ఛాంపియన్, ఒలింపియన్ కూడా. ఆస్ట్రేలియా తరపున 400 మీటర్లు, 400మీటర్ల hurdles, bobsleigh విభాగాల్లో ఆడి అందరిని మెప్పించింది. 1999లో తొలి విజయాన్ని రుచిచూసింది. ప్రపంచ యూత్ చాంపియన్ షిప్స్‌లో బంగారు పతకాన్ని సాధించింది. కానీ, రాబోయే ఏళ్లలో తన విజయం ఒక సంకేతం మాత్రమేనని తెలియజేసింది. 2000లో జానా ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్‌లో 2 బంగారు పతకాలను గెల్చుకుంది. 2002లో రెండు కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలను సాధించి తిరుగులేదని నిరూపించుకుంది. 

ఒక ఏడాది తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్స్ టాప్ లోకి దూసుకెళ్లింది. 2006లో కామన్ వెల్త్ గేమ్స్ లో డబుల్ గోల్డ్ సాధించి స్వదేశానికి తిరిగి వచ్చింది. 2007లో ప్రపంచ చాంపియన్ షిప్స్ లో మరో బంగారు పతకాన్ని సాధించింది. కానీ, తన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా మార్చేసింది. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న తరుణంలో తనవంతు సాయంగా ఇప్పుడు ఆమె ఒక వైద్యురాలు అవతారమెత్తింది. కొవిడ్-19 బాధితులకు అండగా ముందుండి వైద్యసాయం అందిస్తోంది. ఒకవైపు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. గత ఏడాదిలో తాను వైద్యురాలు కావాలనే కలను నేరవేర్చుకుంది. 

ఇప్పుడు దేశంతో పాటు తాను కూడా బాధితులకు సాయం అందిస్తూ కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. కొవిడ్-19 సమయంలో ముందుండి పోరాటం చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. నిజాయితీగా చెబుతున్నా.. నా కల నిజమైంది’ అని ఒక మీడియాకు తెలిపింది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి కంటే మరొకటి ఉండదని ఆమె చెప్పారు. 

Read: కశ్మీర్‌ మాతోనే ఉంటుంది : అఫ్రిదిపై ధావన్ ఫైర్ 

ట్రెండింగ్ వార్తలు