Jawans Jammu
Kashmir: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతమైన వారిలో జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది కూడా ఉన్నాడు. పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. బారాముల్లాలోని తులిబాల్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకున్న భద్రతా బలగాలు మంగళవారం కార్డన్ సెర్చ్ చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు.
Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..? టీఎంసీకి రాజీనామా
దీంతో పోలీసులు ప్రతిస్పందించి కాల్పులను తిప్పికొట్టారని తెలిపారు. దీంతో తులిబాల్ గ్రామంలో ఒక గుర్తు తెలియని మిలిటెంట్ మృతి చెందాడని చెప్పారు. మరోవైపు, దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలోని తుజ్జాన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని పోలీసులు వివరించారు. వారిలో ఒకరు జైషే మొహమ్మద్‌కు చెందిన మజిద్ నాజీర్‌గా గుర్తించినట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మిర్‌ను హత్యచేసిన కేసులో నాజీర్ కూడా ఉన్నాడని వివరించారు.