ఈ 9ఏళ్ల చిన్నారికి గెలవటమే అలవాటు :పూజా బిష్ణోయ్ ప్రతిభకు ప్రధానితో సహా ప్రముఖుల ప్రశంసలు

jodhpur sports wonder kid of india athlete pooja vishnoi : తొమ్మిదేళ్ల చిన్నారి అంటే ఆటలు పాటలు..స్కూల్ కెళ్లటం బుద్ధిగా చదువుకోవటం వరకే ఉంటారు ఆ వయస్సు పిల్లలు. కానీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కు చెందిన తొమ్మిదేళ్ల పూజ బిష్ణోయ్ అనే అమ్మాయికి మాత్రం పరుగులు పెట్టటమే పని.. ఆ పరుగుల్లో రికార్డులు సాధించటమే పని.

ఆమె పరిగెడితే అవార్డులు ఆమె వెనుకే పరుగెడతాయి. ఆమెకు ఎదురొస్తాయి. పట్టుమని పదేళ్లు కూడా లేని పూజ తన ప్రతిభతో అనేక అవార్డులు గెలుచుకుంది. ఏకంగా ప్రధానినితో ప్రశంసలు అందుకుంది. అంతేకాదు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ నుంచి అభినందనలు అందుకుంది. అవార్డుల చిన్నారిగా పేరొందిన పూజ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.

నెట్వర్క్ 18 బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారులను అందరికీ పరిచయం చేస్తోంది. దీంట్లో భాగంగా..జనవరి 23 శనివారం ప్రసారం కానున్న రెండవ ఎపిసోడ్‌లో ప్రేక్షకులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివసిస్తున్న అథ్లెట్, ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న పూజా బిష్ణోయిని రికార్డుల ప్రతిభను చూడనున్నాం.

పూజ బిష్ణోయ్ తన ప్రతిభతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన ఫౌండేషన్ ఆ చిన్నారికి సహాయం కూడా అందిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పూజాకు అభిమాని అంటే అతియోక్తి కాదు. అంటే పూజా ప్రతిభ ఏంటో ఊహించుకోవచ్చు. ఇలా బిగ్గెస్ట్ సెలబ్రిటీలు పూజ ప్రతిభను ప్రశంసిస్తున్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పూజా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి అభినందించారు. పశ్చిమ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని గుడా విష్ణోయన్ గ్రామానికి చెందిన పూజాకు గెలుపు అలవాటుగా మారిపోయింది. అమాయకంగా కనిపించే ఈ అథ్లెట్ లక్ష్యాలు చాలా స్ట్రాంగా ఉన్నాయి.

పూజా ఖాతాలో ఎన్నో రికార్డులు..
శ్రావణ బుధియా పూజ కోచ్. తొమ్మిదేళ్ల వయస్సులో పూజా కేవలం 12 నిమిషాల 50 సెకన్లలో 3 కిలోమీటర్లు పరుగు పూర్తి చేసిన రికార్డు సృష్టించింది. అలాగే 10 కిలోమీటర్ల రేసు 48 నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రపంచ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా పూజా ప్రాక్టీస్ చేస్తోంది. నిరంతరం సాధన..సాధన..సాధన. ఈ తొమ్మిదేళ్ల చిచ్చరపిడుగుకి 6 ప్యాక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రపంచానికి వెలుగుని జీవితాలను ఇచ్చే సూర్యుడు ఉదయించకముందే పూజా తన సాధన మొదలు పెడుతుంది. అమితాబ్ బచ్చాన్, విరాట్ కోహ్లీ, ప్రధాని మోడీలాంటి ఎంతో మంది ప్రముఖులు, ఇతర అభిమానులు వివిధ వేదికల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహంతో పూజ ముందుకు సాగుతోంది. తన పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని పూజా బిష్ణోయ్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం..

ట్రెండింగ్ వార్తలు