Jr Ntr Movie With Uppena Director Buchhibabu Sana Not Yet Confirmed
Jr NTR: ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కూడా వరసగా అదేస్థాయిలో పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ తన మార్కెట్ పెంచుకొనే పనిలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాతో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ క్రేజీ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కూడా తమిళ దర్శకుడు అట్లీ, మెగా హిట్ సాధించిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా సినిమాలు చేయనున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన సుకుమార్ దగ్గర శిష్యుడిగా ఉన్నప్పటి నుండే తారక్ తో అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు కథ చెప్పిన బుచ్చిబాబుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పుకున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున బుచ్చిబాబు కూడా శుభాకాంక్షలు చెప్తూ లోకల్ కథను ప్రపంచస్థాయికి వినిపించేలా చెబుదామని ట్వీట్ చేశాడు. దర్శకుడే తన సినిమాపై ప్రకటించడంతో ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా దాదాపుగా ఫిక్స్ అనుకున్నారు.
కానీ, ఇప్పటికీ ఈ సినిమా ఇంకా ఖరారు కాలేదని కొత్తగా రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బుచ్చిబాబు ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ చేస్తుండగా బౌండ్ స్క్ట్రిప్ట్ పూర్తయ్యాక తారక్ మరోసారి విని ఖరారు చేయాల్సి ఉందని… అప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. నిజానికి ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కలన్నా మరో ఏడాది పడుతుంది. ఈలోగా బుచ్చిబాబు ఈ కథకు పూర్తి స్క్రిప్ట్ పూర్తి చేసి ఎన్టీఆర్ ను మెప్పిస్తాడో లేదో చూడాలి!