బుల్లితెరపై ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రోమో షూట్..

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ని విజయవంతంగా హోస్ట్ చేసి వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకున్న తారక్.. మరోసారి బుల్లితెరపై ఓ రియాలిటీ షోతో అలరించేందుకు సిద్ధం అయ్యాడు. టీవీ హోస్టుగా అదరగొట్టేందుకు సిద్ధం అయ్యాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో వంటి రియాలిటీ షో ద్వారా.. తారక్ బుల్లితెరకు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

“ఎవరు మీలో కోటీశ్వరుడు” పేరుతో కౌన్ బనేగా కరోడ్‌పతి షో మాదిరి ప్రోగ్రామ్‌ని తెలుగులో చేస్తుండగా.. ఆ షోకి తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ షోకు సంబంధించి ప్రస్తుతం అన్నపూర్ణ 7ఎకర్స్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రోమోస్ షూట్ జరుగుతోండగా.. మార్చి తొలివారంలో ఆడిషన్స్.. మూడవ వారంలో సెలెక్ట్ అయినవారిని లిస్ట్‌ను విడుదల చేయాలని ప్రోగ్రామ్ నిర్వాహకులు ప్లాన్ చేసుకున్నారు.

ఏప్రిల్ మూడోవారంలో ఫస్ట్ ఎపిసోడ్.. షూటింగ్ చేస్తారు. ఏప్రిల్ చివరివారంలో షోని ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్ నుంచి షోకి సంబంధించిన ప్రోమోస్ టీవీలో ప్రసారం కానున్నాయి. మొత్తం ఐదు టీజర్ ప్రోమోలు టీవీలో ప్రసారం కానున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రోమోలు షూట్ చేస్తున్నారు. మొత్తం 60ఎపిసోడ్స్ చేయనుండగా.. ఈ ప్రోగ్రామ్‌కు ఎవరు మీలో కోటీశ్వరుడు.. అనే పేరు పెట్టారు. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానెల్‌లో ఈ ప్రోగ్రామ్ ప్రసారం కాబోతుంది.