Jr Ntr Viral Pic Jr Ntr As Bulli Ramudu Photo Goes Viral Once Again
Jr NTR Viral Pic: ఒక్క ఫోటో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా కాపాడుతుంది. అందుకే శుభకార్యం ఏదైనా ఫోటోలు తీసుకొని జ్ఞాపకంగా మార్చుకోవడం అనాదిగా వస్తుంది. అయితే.. అలాంటి ఒకనాటి ఫోటోలు ప్రస్తుత కాలంలో చూసుకుంటే భావోద్వేగానికి .. చెప్పలేని భావనతో కూడిన అనుభూతిని పొందుతారు. అలాంటి అనుభూతినే ఇప్పుడు తారక్ అభిమానులు పంచుకుంటున్నారు. బాలరాముడిగా మా బుల్లి రామయ్య మెరిసిపోతున్నాడే అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. అలనాటి ఆ ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియా పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు.
ఇప్పుడంటే స్టార్ డం, మంచి ఫార్మఫర్, కూచిపూడి నుండి స్వింగ్ తెప్పించే డాన్స్ వరకు చేయగల నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఒకనాడు ఎన్టీఆర్ కూడా జూనియరే. హీరోకంటే ముందుగా బాలనటుడిగా రెండు సినిమాలు నటించాడు. అందులో ఒకటి తాత సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మర్షి విశ్వామిత్ర కాగా మరొకటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణం. బాల రాముడిగా ఎన్టీఆర్ ఆ సినిమాలో నటన ఇప్పటికీ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంటుంది. కాగా.. బలరామాయణం నాటి జూనియర్ ఫోటో ఒకటి ఇప్పుడు అభిమానులు త్రో బ్యాక్ బయటకు తెచ్చారు.
సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, సీత పాత్రతో కలిసి జూనియర్ ఫోజివ్వడం అలనాటి జ్ఞాపకాల పరిమళాలను మరోసారి అనుభవించేలా చేస్తుంది. ఈ ఫొటోలో ఉన్నవాళ్ళు ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ హీరో అవుతాడని అప్పుడు అనుకోని ఉండకపోవచ్చు. అసలు ఈ ఫొటోలో ఉన్నవారు ఇప్పుడు ఏ పొజీషన్లో ఉన్నారో కూడా తెలియదు. కానీ అభిమానులు మాత్రం ఈ ఫోటో చూసి ముచ్చటపడుతున్నారు. ఈ త్రోబ్యాక్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మన జూనియర్ అప్పుడు భలేగా ఉన్నాడే’ అని హ్యాపీ ఫీలవుతున్నారు. మరి ఎన్టీఆర్ ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో మరి!