NTR: ఆ హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేస్తానంటోన్న తారక్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ గోండు బెబ్బులి కొమురం భీం....

Jr Ntr Wants To Do Multi Starrer With These Heroes

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్రలో తన నటవిశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న RRRలో మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక బాహుబలి చిత్రం తరువాత దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

NTR : ఎన్టీఆర్ పిల్లలని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉన్నారో

కాగా ప్రస్తుతం RRR ప్రమోషన్స్‌లో యమ బిజీగా ఉన్న తారక్, తాజాగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. అయితే ఆయన చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయడం ఎలా ఉందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. మంచి కథ పడితే ఏ హీరో అయినా మల్టీస్టారర్ మూవీ చేసేందుకు వెనకాడడని తారక్ తెలిపారు. ఇక ఇదే క్రమంలో తన మనసులోని మాటను కూడా బయటపెట్టాడు యంగ్ టైగర్.

టాలీవుడ్‌లో ఏ హీరోలతో మల్టీస్టారర్ చేయాలని ఉంది అని తారక్‌ను అడగ్గా.. అందరూ ఆశ్చర్యపోయే సమాధానం చెప్పుకొచ్చాడు ఈ హీరో. తెలుగు హీరోల్లో తాను మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే.. ఖచ్చితంగా ‘‘బాల బాబాయి, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌తో చేస్తాను’’ అంటూ తారక్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.

NTR30: తారక్ అక్కగా సోనాలీ రీఎంట్రీ!

అయితే తారక్ లాంటి పర్ఫెక్షన్ ఉన్న నటుడితో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేయాలంటే ఆ సినిమాను తెరకెక్కించే డైరెక్టర్‌లో అంతే సత్తా ఉండాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక తారక్ కొమురం భీం పాత్రలో ఎలాంటి విధ్వంసాన్ని చూపించబోతున్నాడా అని తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. RRR తరువాత తారక్ తన కెరీర్‌లో 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరి తారక్ చేయాలనుకుంటున్న మల్టీస్టారర్ చిత్రాల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.