Jubilee Hills Rape Case: నిందితుల డీఎన్ఏ సేకరణకు పోలీసుల ఏర్పాట్లు

ఆరుగురు నిందితుల డీఎన్ఏ వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లతోపాటు, సాదుద్దీన్ డీఎన్ఏను కూడా పోలీసులు సేకరించాలి అనుకుంటున్నారు.

Jubilee Hills Rape Case: ఇటీవల సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరుగురు నిందితుల డీఎన్ఏ వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లతోపాటు, సాదుద్దీన్ డీఎన్ఏను కూడా పోలీసులు సేకరించాలి అనుకుంటున్నారు. దీనికోసం జువైనల్ బోర్డుతోపాటు, కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. త్వరలోనే డీఎన్ఏ సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతారు. పోలీసుల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే ఇన్నోవా కారులోని ఆధారాలు సేకరించారు. డీఎన్ఏ రిపోర్టు కూడా వస్తే నిందితులు నేరానికి పాల్పడ్డట్లు సులభంగా రుజువు చేయొచ్చు.

Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ

దీంతో పోలీసులకు సైంటిఫిక్ ఆధారం కూడా లభించినట్లవుతుంది. అవసరమైతే బాధితురాలి నుంచి కూడా డీఎన్ఏ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఘటనపై కోర్టులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. మరోవైపు నిందితుల పాస్‌పోర్టులను కూడా సీజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం కోర్టును ఆశ్రయించనున్నారు. పాస్‌పోర్టు సీజ్ చేయకపోతే, ఒకవేళ కోర్టులో బెయిల్ లభిస్తే నిందితులు విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరుగురు నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌లు తిరస్కరణకు గురయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు