Kadapa Fake Cbi Gang Arrested
Fake CBI Officers Gang : కడప జిల్లాలో సీబీఐ అధికారులమని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన ఖాజీపేట మండలం పుత్తూరు గ్రామానికి చెందిన అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న అధ్యాపకుడు ఉదయ్‌కుమార్‌ను సీబీఐ అధికారులమని చెప్పి, విచారణ పేరుతో నిందితులు కారులో తీసుకువెళ్ళారు.
ఒక రోజంతా కారులో తిప్పుతూ అతని వద్దనుంచి ఫోన్ పే ద్వారా రూ.1.14లక్షలు తీసుకుని మరుసటి రోజు వదిలిపెట్టారు. బాధితుడు ఈ విషయంపై చెన్నూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఉదయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read : AP Covid Update : ఏపీలో కొత్తగా 186 కోవిడ్ కేసులు
వారిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు,నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన వారు ఒక్కోక్కరు ఉన్నారు. ఈ ముఠా గతంలో పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏలూరులో ఒక వ్యక్తి వద్ద డబ్బులు వసూలు చేసిన కేసు ఉంది. నిందితుల వద్ద నుంచి 84 వేల రూపాయల నగదు,కారు, నకిలీ ఐడి కార్డుల స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు.