Kajal Aggarwal Blessed With Baby Boy
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లును వివాహమాడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కాజల్ కొన్ని సినిమాల్లో నటిస్తూ వచ్చినా, కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. ఇక ఆచార్య చిత్రంలోనూ కాజల్ పాత్ర చాలా తక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నెలల క్రితం కాజల్ గర్భవితి అనే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవల తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేసింది ఈ బ్యూటీ.
Kajal Aggarwal : ఘనంగా కాజల్ సీమంతం వేడుకలు
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే ఈ విషయంపై కాజల్ అగర్వాల్, ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇంకా స్పందించలేదు. కాగా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు కాజల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు.
Kajal Aggarwal: ప్రెగ్నెన్సీలో కూడా ఆపని ఫోటో షూట్లు!
ఇటీవల తన బేబీ బంప్‌తో కనిపించిన కాజల్, తాజాగా మగబిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రెగ్నేన్సీ సమయంలో తన బాడీ షేప్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేయగా, వాటిపై కాజల్ తీవ్రంగా స్పందించింది.