కాజల్ ‘సెలబ్రేటింగ్‌ లైఫ్‌’.. కమింగ్ సూన్..

  • Publish Date - December 4, 2020 / 08:18 PM IST

Kajal Aggarwal’s ‘Celebrating Life’: కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు జంట గతకొద్ది రోజులుగా మాల్దీవ్స్‌లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కాజల్. పెళ్లి తర్వాత భర్తతో కలిసి కొత్త ప్రపంచాన్ని సరికొత్తగా ఎంజాయ్ చేస్తున్నానంటూ హనీమూన్ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది.

https://10tv.in/kajal-aggarwal-and-gautam-kitchlu-underwater-pics/

శుక్రవారం ‘సెలబ్రేటింగ్‌ లైఫ్‌’ అనే ఓ వీడియో తన ఇన్‌స్టాలో షేర్ చేసింది కాజల్‌. ఇందులో ఓ బిగ్ బిల్డింగ్ మధ్యలో ఉన్న నీటి కొలనులో హ్యాపీగా ఎంజాయ్ కనిపించింది. అంతేకాదు, ‘కమింగ్ సూన్’ అంటూ.. ఇది కేవలం ప్రోమో మాత్రమేనని త్వరలోనే పూర్తి వీడియో పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మరి కాజల్ ఫుల్ వీడియోలో ఫ్యాన్స్‌కు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తుందో చూడాలి.


కాగా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన కాజల్ చేతిలో ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు